Sharmila Should ask the Same Question to Jagan's Wife

Tdp leaders fire on sharmila speech at plenary

Sharmila, Sharmila Jagan Wife, Sharmila Bharati, Bharathi Jagan, Chandrababu Wife Sharmila, Sharmila Speech at Plenary, Chandrababu Wife Jagan Wife

TDP Leaders fire on Sharmila's Comments on Chandrababu wife at Plenary. Ask the same question to Bharati living with Jagan after he went to Jail.

భువనేశ్వరిని కాదు.. ఆ మాట భారతిని అడుగు...

Posted: 07/11/2017 02:30 PM IST
Tdp leaders fire on sharmila speech at plenary

చాలా గ్యాప్ తర్వాత వైసీపీ ప్లీనరీ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన వైఎస్ షర్మిల టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రిపై ఓ రేంజ్ లోనే ఫైర్ అయ్యింది. ఈ క్రమంలో ఆయన సతీమణి భువనేశ్వరి ప్రస్తావన తీసుకొస్తూ.. జన్మనిచ్చిన కన్న తండ్రి(ఎన్టీఆర్) ను వెన్నుపోటు పొడిచినప్పటికీ మాంగల్యాన్నే చూస్కుందంటూ సెటైర్ లు కూడా వేసింది. దీనిపై టీడీపీ నుంచి కౌంటర్ రియాక్షన్ వచ్చింది.

అక్రమాస్తుల కేసులో పద్దెనిమిది నెలలు జైలు జీవితం గడిపిన జగన్ తో, తన వదిన(భారతి) కాపురం ఎలా చేస్తోందో సోదరి షర్మిల తెలుసుకోవాలని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కోరాడు. అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మద్య నిషేధం విధిస్తానని చెప్పిన జగన్, మొట్టమొదట తన పక్కన ఉన్న వాళ్లతో మద్యం మాన్పించాలని, తమ పార్టీ నేతలతో మద్యం వ్యాపారం కూడా మాన్పించాలని ఆయన సూచించారు.

జగన్ కు రాజకీయం చేతగాకనే ప్రశాంత్ కిషోర్ ను తెచ్చుకున్నారని విమర్శించారు. మరో మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, జగన్ ఆశనిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని, ఆయన అధికారంలోకి రావడమనేది కలగానే మిగిలిపోతుందని అన్నారు.

కాగా, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ, మేనిఫెస్టోలను నమ్మి ప్రజలు ఓట్లేసే రోజులు పోయాయని, రాష్ట్ర ఆదాయానికి మించి వైసీపీ హామీలు ఉన్నాయని విమర్శించారు. ఈ హామీలను నెరవేర్చగలమా, లేదా? అనే విషయాన్ని పార్టీ నేతలే ఆలోచించుకోవాలని అన్నారు. ఇక ఎక్సైజ్ మినిస్టర్ జవహార్ ఓ అడుగు ముందుకేసి ప్రశాంత్ కిషోర్ వైసీపీ నూతన అధ్యక్షుడంటూ ఛలోక్తులు పేల్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Sharmila  Plenary Speech  Chandrababu Wife  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more