D srinivas finally joined trs party and makes controversial comments on digvijay singh | trs party | congress

D srinivas controversial comments digvijay singh trs party congress leaders

d srinivas, d srinivas join trs, d srinivas press meet, d srinivas photos, d srinivas controversies, digvijay singh, digvijay singh controversies, digvijay singh latest news, d srinivas with digvijay, congress party, trs party

d srinivas controversial comments digvijay singh trs party congress leaders : Congress senior leader D srinivas finally joined trs party and makes controversial comments on digvijay singh.

దిగ్విజయ్ ఓ లోఫర్ : డీఎస్

Posted: 07/02/2015 01:02 PM IST
D srinivas controversial comments digvijay singh trs party congress leaders

కాంగ్రెస్ సీనియర్ నేత డీ.శ్రీనివాస్ పార్టీని వీడుతున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఆయనపై మండిపడ్డారు. ఎన్నికల్లో డీఎస్ ఓటమి పాలైనా అతనికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందని, ఆయన సీనియారిటీని చూసి తాము పదవులిచ్చి గౌరవించామని డిగ్గీరాజా పేర్కొన్నారు. అలాగే.. డీఎస్ ప్రతిపాదించిన ఆకుల లలితకు ఎమ్మెల్సీ పదవి ఇప్పించామని ఆయన అన్నారు. ‘ఇంతగా కాంగ్రెస్ గౌరవించిన ఆయనకు.. ఇంకేం చేయాలి?’ అని ప్రశ్నించారు. చివరగా డీఎస్ ఓ ‘అవకావవాది’ అని డీఎస్ పై డిగ్గీరాజా ఆగ్రహంతో విరుచుకుపడ్డారు.

ఈ విధంగా డిగ్గీరాజా చెప్పిన వ్యాఖ్యలపై డీఎస్ కూడా ఘాటుగానే స్పందించారు. ఆయనకు డిగ్గీపై విమర్శనాస్త్రాలు సంధించారు. తాజాగా హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన డీఎస్.. డిగ్గీరాజా చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దిగ్విజయ్ తనపట్ల దిగజారి మాట్లాడారని, వందల బీఫామ్ లు ఇచ్చిన తనకు ఎమ్మెల్సీ పదవి ఒక లెక్క కాదని డీఎస్ చెప్పారు. చెప్పుడు మాటలు విని మాట్లాడుతున్న దిగ్విజయ్ ‘ఓ లోఫర్’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘తన గురించి మాట్లాడటానికి దిగ్విజయ్ కి ఎంత ధైర్యం?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకుల లలితకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించారు. కాంగ్రెస్ లో తనకు ఎన్నో పదవులు వచ్చాయని.. అవమానాలు కూడా ఎదురయ్యాయని తెలిపారు.

ఇక ఈ క్రమంలోనే డీఎస్ తాను టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం మాత్రమే తాను టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని, అయితే కాంగ్రెస్ పార్టీని వీడటం ఎంతో బాధిస్తోందని అన్నారు. 1969లో గాంధీభవన్ లో అడుగుపెట్టానని గుర్తుచేసుకున్న ఆయన.. 2000లో తెలంగాణ గురించి అసెంబ్లీలో మాట్లాడానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో తనకు ఎన్నో అవకాశాలు కల్పించిన అధినేత్రి సోనియాకు జీవితాంతం రుణపడి వుంటానని అన్నారు. తాను పదవులు ఆశించి టీఆర్ఎస్ లో చేరడం లేదని, రాష్ట్ర అభివృద్ది కోసమే పార్టీలో చేరుతున్నానని డీఎస్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : d srinivas  digvijay singh  congress party  trs  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more