tummala nageswara rao controversial comments rahul gandhi yatra congress party

Rahul yatra tummala news gif

tummala nageswara rao, rahul gandhi, rahul gandhi yatra news, congress party updates, trs party ministers

tummala nageswara rao controversial comments rahul gandhi yatra congress party : telangana minister tummala nageswara rao controversial comments on rahul gandhi yatra.

రాహుల్ ని పిలిచి అవమానించారు : తుమ్మల

Posted: 05/16/2015 04:02 PM IST
Rahul yatra tummala news gif

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ‘రైతు భరోసా యాత్ర’ పేరిట ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే! అయితే.. ఈయన పర్యటనపై తెరాస రకరకాలుగా విమర్శలు గుప్పించారు. రాహుల్ యాత్ర రైతుల కోసం కాదని.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలపరుచుకోవడం కోసమేనని ఆరోపణలు చేశారు. ఈ తరహాలోనే తాజాగా తెలంగాణ రోడ్డు, భవనాల శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిప్పులు చెరిగారు.

శుక్రవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన తుమ్మల.. రాహుల్ యాత్రపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమాయకుడైన రాహుల్ గాంధీని తెలంగాణకు పిలిచి, అతనిని కాంగ్రెస్ నేతలు అవమానించారని ఆయన మండిపడ్డారు. పర్యటనకు ముందు రాహుల్ కు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకే ఆర్థిక సహాయం చేశారని, అంతకుమించి ఏమీ చేయలేదని ఆయన విమర్శించారు.

రాహుల్ చేసిన యాత్ర ‘రైతు భరోసా యాత్ర’లా కాకుండా.. కాంగ్రెస్ ‘మేలుకొలుపు’ యాత్ర జరిపించారని ఎద్దేవా చేశారు. మరో నాలుగేళ్ల తర్వాత రైతు ఆత్మహత్యలు జరిగితేనే టీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని ఆయన అన్నారు. మరి.. ఈయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tummala nageswara rao  rahul gandhi yatra  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more