పవన్ కళ్యాణ్ భార్య రేణుదేశాయ్ గత కొంత కాలం నుండి ఆయన దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే మీడియా వారిద్దరి విడిపోయారని ప్రచారం చేసింది. అయితే సన్నిహిత వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం పిల్లల చదువుకోసమే రేణుదేశాయ్ చెన్నైలో ఉంటుందని అంటున్నారు. గత కొన్ని రోజులుగా వెండితెరకు దూరం అయిన రేణుదేశాయ్ తాజాగా సినీ నిర్మాణ రంగంలో అడుగు పెట్టబోతుంది. ప్రస్తుతం ఆమె మరాఠీ సినిమా నిర్మించబోతుంది. 'మంగళాష్టక్కే వన్స్‌మోర్' పేరుతో ఇది రూపొందుతోంది. ఇది భార్యాభర్తల అనుబంధం చుట్టూ తిరిగే కథ ఆధారంగా నిర్మిస్తున్నారు. అయితే ఇది తన వ్యక్తిగత జీవితాన్ని ఆధారంగా చేసుకొనే ఈ సినిమా నిర్మిస్తుందని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది.
రేణు తొలిసారి తెలుగులో పవన్‌కల్యాణ్ సరసన 'బద్రి'లో నటించారు. ఆ తరవాత పవన్ దర్శకత్వం వహించిన 'జానీ'లోనూ ఆమే హీరోయిన్ . ఆ తరవాత పవన్ నటించిన కొన్ని చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించారు. ఇన్నాళ్ళు సైలెంటుగా ఉన్న రేణుదేశాయ్ ఇప్పుడు నిర్మాతగా మారడం వెనుక సినీ జనాలు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఈమె పవన్ తో విడిపోయినందుకు భరణం కింద తీసుకున్న పైసలతో సినిమా తీయడానికి రెడీ అయిందని, ఆ మధ్య పవన్ ఆస్తులు అమ్మకానికి పెట్టి భరణం చెల్లించడంతో ఆ డబ్బుతో ఈ పనికి పూనుకుందని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ పుణెలో సాగుతోంది. స్వప్నిల్ జోషి, ముక్తా భార్వే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరి సంసార జీవితంలో రాణించని రేణు దేశాయ్ నిర్మాణ రంగంలో ఏ మాత్రం రాణిస్తుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more