వాడుకుని వదిలివేయడం కేసీఆర్‌కు అలవాటే

Posted: 05/02/2013 07:49 PM IST
chada-suresh-reddy.gif

 

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు పెట్టిన ఆకర్ష పథకం ..వికటించింది. ఒకేసారి ముగ్గురు నాయకులు కేసిఆర్ కు షాకిచ్చారు. కేసిఆర్ పై మాజీ పార్లమెంట్ సభ్యుడు చాడ సురేష్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్‌కు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం ఎంతమాత్రం ఇష్టంలేదని, డబ్బులు దండుకోవడమే ఆయన పనని, డబ్బులు అవసరమైనప్పుడు ఉద్యమం, లేదంటే ఫామ్ హౌస్‌కు ఆయన పరిమితం అవుతారని చాడ ఆరోపించారు. టీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన చాడ సురేష్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ తప్పులను ఎత్తి చూపడం వల్లే తమను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆయన ఆగ్రహం వ్యకం చే శారు. వాడుకుని వదిలివేయడం కేసీఆర్‌కు అలవాటే అని ఆరోపించారు.

కేసీఆర్ నాయకత్వంలో 10 అసెంబ్లీ సీట్లు కూడా గెలవడం కష్టమే అని చాడ సురేష్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో కూర్చుని 15 సీట్ల కోసం కలలు కంటున్నారని ఆయన అన్నారు. టీఆర్ఎస్ నుంచి తనను ఎందుకు బహిష్కరించారో సమాధానం చెప్పాలని చాడ సురేష్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ వంటి ఉద్యమకారుడు, నాయకుడు వల్లే ప్రత్యేక తెలంగాణ సాధ్యమని ఆయన పేర్కొన్నారు. కెసిఆర్ తెలంగాణ కోసం ఉద్యమించడం లేదన్నారు. కెసిఆర్, కోదండరామ్‌ల మధ్య గతంలో విభేదాలు పొడసూపిన విషయం తెలిసిందే. అయితే, చాడ సురేష్ రెడ్డి ఈ రోజు కెసిఆర్‌ను తూలనాడుతూ, కోదండ రామ్ వల్లే తెలంగాణ సాధ్యమని చెప్పడంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

 

Other Articles

 • Sanjay-Dutt-back-home

  సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

  Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

 • dhoom3-record

  కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

  Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

 • kanna-politics

  కలకలం రేపిన మంత్రి కన్నా

  Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

 • gay-romance-verdict

  గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

  Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more

 • Tamanna playing role in Baahubali Movie

  మిల్కీబ్యూటీకి రాజమౌళి సినిమాలో ఛాన్స్

  Dec 20 | ‘రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదువా ’ అన్నట్లు... మన దర్శకధీరుడు రాజమౌళి తలుచుకుంటే తన సినిమాలో ఎంతమంది స్టార్లనైనా పెట్టుకొంటాడు. రాజమౌళి ప్రస్తుతం యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోగా, అనుష్క హీరోయిన్‌గా దర్శకేంద్రుడు... Read more

Today on Telugu Wishesh

 

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers