Panchamrutham for pooja

Panchamrutham, amrutham, milk, curd, honey, sugar, ghee, prasadam to God in temples, Hindu temples, cow, health,

panchamrutham for pooja

మన అర చేతిలోనే 'అమృతం'

Posted: 05/08/2013 04:21 PM IST
Panchamrutham for pooja

ఇంట్లో , గుడిలో ఏ పూజ , వ్రతం నిర్వహించినా , ఆ భగవత్ స్వరూపం యొక్క పఠం తో పాటు, ఇతర పూజా సామగ్రీ కి యెంత ప్రాధాన్యత ఇస్తామో , అలాగే నైవేద్యం గా, భగవత్ స్వరూపం యొక్క ప్రతిమకు మనం చేసే అభిషేకానికి తయారు చేసుకునే పంచామృతంకి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాం ... 

భగవంతుని ఆరాధనకు, పూజకు , వ్రతానికి ఉన్న ప్రాముఖ్యత తెలుసుకున్నట్టుగానే పంచామృతం లో ఉండే ఔషద విలువలు తెలుసుకునే ఆలోచన వస్తే , మీరు ఈ నాటి అన్వేషణని చదవడం కొనసాగించావలసిందే ... 

పంచదార, పాలు, పెరుగు, నెయ్యి, తేనె ఈ అయిదింటిని కలిపి పంచామృతంగా చేస్తారు. పాలు అంటే , ఆవు పాలనే వాడతాం కదా ... సరే , కాసేపు భక్తీ , ఆధ్యాత్మికత అనే అంశాలని పక్కన పెట్టి కేవలం పంచామృతం మనకు పంచె ఔషద విలువలని తెలుసుకోదలిస్తే , పాలు , పెరుగు , నెయ్యి , తేనే , పంచదార కూడా మన శరీర సరి అయిన పని తీరుకి ఎంతో దోహదం చేస్తాయి అని , మన వైద్య విధానం ఆయుర్వేదమే సూచిస్తోంది ... అది ఎలా అంటే ; 

ఆవుని మన సాంప్రదాయం లో తల్లితో సమానంగా కొలుస్తాం ... అలాగే ఆవుపాలు తల్లి పాల తో సమానం అంటారు ... గేదె పాల కంటే కాస్త అధికంగానే ఆవు పాలలో విటమిన్ ఏ వంటి పోషక విలువలు అధికంగా ఉంటాయి ... ఆవు పాలు త్వరగా జీర్ణం అయ్యి , శరీరానికి కావలసిన శక్తిని ఇచ్చి , అమృతం లానే పని చేస్తాయి ... ఇంతే కాక , మనం నమ్మడానికి కాస్త జంకినా , ఆవు పాలు సరి అయిన మోతాదులో స్వీకరించడం వల్ల, అధిక బరువు కూడా తగ్గుతాం అట ... 

ఇక నెయ్యి ... ఆయుర్వేదం అనుసారం మేధా శక్తిని పెంచడం లో నెయ్యిని మించిన ఔషదం లేదు ... వయస్సు తో నిమిత్తం లేకుండా నెయ్యిని రోజు తగిన మోతాదులో తీసుకునే వారి మేధా శక్తి, జ్ఞ్యాపక శక్తి పెరిగే అవకాసం పుష్కలంగా ఉంది ... 

పెరుగులో ఉన్న సుగుణాల గురించి తెలుసుకున్నట్లయితే, జీర్ణ సంబంధీత సమస్యల నుండి ఉపసమనం పొందాలి అంటే , యాసిడిటి వంటి సమస్యలను తరమి కొట్టాలి అంటే , పెరుగు , మజ్జిగ ని మించిన ఔషదం ఉందంటారా??? 

అధిక బరువు తగ్గాలి అన్న , కొన్ని రకాల చర్మ సమస్యల నుండి తక్షణం విముక్తి పొందాలన్నా , శరీర పని తీరు ఉత్సాహంగా జరగాలన్నా , తేనెని మించింది ఏదీ లేదు ... 

చెక్కర కూడా శరీరానికి వెంటనే శక్తిని ఇస్తుంది ... షుగర్ వ్యాధి తో బాధ పడే వారు , శరీరం లో షుగర్ లెవెల్స్ తగ్గితే వెంటనే తీనె కలిపిన నీళ్ళు తీసుకుంటారు అంటే, దీని సద్గుణం ఎంతటిది మరి ??? 

అంటే , ఆ దైవానికి మనం చేసే పూజలు , వ్రతాలు , ఎలా అయితే మనకే తిరిగి మంచి చేస్తాయో , అలాగే దైవ స్వరూపానికి నైవేద్యంగా అర్పించే పంచామృతం కూడా మనకే మేలు చేస్తుంది అన్న విషయం మరోసారి రుజువయ్యింది ... 

అతిగా తీసుకుంటే అమృతం కూడా విషంగా మారుతుంది అన్న విషయాన్ని గ్రహించి , పంచామృతం లో ఉన్న అన్ని పదార్ధాలనీ తగిన మోతాదులో తీసుకుంటే , ఇవి మనకు మంచే చేస్తాయి ... 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles