Tollywood actress telangana sakuntala biography

sakuntala biography, telangana sakuntala biography in telugu, telangana sakuntala history, telangana sakuntala story in telugu, telangana sakuntala history in telugu, telangana sakuntala news, telangana sakuntala death news, telugu news, tollywood news, tollywood industry, telugu actress telangana sakuntala death

tollywood actress telangana sakuntala biography

తెలంగాణ యాసను ఇంటిపేరుగా మార్చుకున్న శకుంతల

Posted: 06/14/2014 04:08 PM IST
Tollywood actress telangana sakuntala biography

(Image source from: tollywood actress telangana sakuntala biography)

మన తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన నటీనటులు ఎందరో వున్నారు. పరభాషా నటీనటులు కూడా టాలీవుడ్ లో దర్శనమిస్తున్నారు. కొంతమంది నటీనటులు కొంతకాలం వరకే తమ ప్రతిభను ప్రదర్శిస్తే.. మరికొంతమంది తమ నటనతో ప్రేక్షకులను ఆకర్షించి, వారి హృదయాల్లో చిరకాలం వుండిపోతారు. కొంతమంది కేవలం తమ నటనతో రాణిస్తే.. మరికొంతమంది మాత్రం అనేక విభాగాల్లో పాల్గొంటూ... విభిన్న పాత్రలను పోషిస్తూ... తమదైన ముద్ర వేసుకుని మహానటులుగా పేరు సంపాదించుకుంటారు. అటువంటి ముఖ్యమైన నటీనటులలో నుంచి తెలంగాణ శకుంతల ఒకరు.

తెలంగాణ యాసతో నటనలో మంచి ప్రతిభను ప్రసాదించి అందరి ప్రేక్షకుల నుంచి గౌరవ మన్ననలు సంపాదించుకున్న నటి శకుంతల. దీంతో ఈమెకు తెలంగాణ శకుంతలగా పేరొచ్చింది. ఇంకొక ప్రత్యేకతేమిటంటే... ఈమె జన్మస్థలం మహారాష్ట్ర. పరభాషా నటీమణి అయినప్పటికీ తెలుగు భాషను స్పష్టంగా ఉచ్ఛరించి, తెలంగాణ యాసతో అందరిని ఆకట్టుకుని, ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని పొందుపరుచుకున్నారు.

1981వ సంవత్సరంలో ‘‘మా భూమి’’ సినిమా ద్వారా శకుంతల తెలుగు చిత్రపరిశ్రమలోకి రంగప్రవేశం చేశారు. ఆ తరువాత నటించిన గులాబీ చిత్రం... ఈమెను ఒక మంచి నటిగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ‘‘ఒసేయ్ రాములమ్మ’’ సినిమాలో తెలంగాణ యాసలో ఆమె నటించిన పాత్రకు మంచి గుర్తింపు లభించింది. ఆ సినిమా తరువాతే ఈమె ‘‘తెలంగాణ శకుంతల’’గా ముద్ర పడిపోయింది. శకుంతల ముందు పౌరాణిక పాత్రలు ధరిస్తూ నాటకాలలో నటించేవారు. పద్యపఠనంలో మంచి ప్రావీణ్యం సంపాదించుకున్న ఈమె... ‘‘శ్రీ కృష్ణ తులాభారం’’ నాటకంలో సత్యభామగా పాత్రను పోషించారు. తరువాత ‘‘మహాకవి కాళిదాసు’’ నాటకంలో విద్యాధరిగా నటించి, అప్పటిలో మంచి పేరును సంపాదించుకున్నారు.

తెలుగు సినిమా రంగంలో క్యారెక్టర్ నటి, హాస్యనటిగా మంచి గుర్తింపును తెచ్చుకున్న శకుంతల... 75పైగా చిత్రాలలో నటించారు. అసలు చిత్రసీమలోనే తెలంగాణ యాసకు ప్రత్యేతక తీసుకొచ్చిన నటి ఈమెనని చెప్పుకోవడంలో ఎటువంటి సంశయం లేదు. ఎందరో నటీనటులు తెలంగాణ యాసలో పాత్రలను పోషించినప్పటికీ... అందులో రాణించలేకపోయారు. కానీ శకుంతల మాత్రం అదే తెలంగాణ యాసతో చిత్రపరిశ్రమలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఈమె ‘‘కుక్క’’ సినిమాలో ప్రదర్శించిన మంచి నటనకుగాను.. నంది ఉత్తమ నటీమణి అవార్డు లభించింది. అలాగే నువ్వు నేను, లక్ష్మీ, అహ నా పెళ్లంట, ఎవడిగోల వాడిదే వంటి చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలకు మంచి గుర్తింపు లభించింది. తెలుగులోనే కాకుండా తమిళ భాషలో కూడా కొన్ని చిత్రాల్లో నటించింది. తెలంగాణ శకుంతల నటించిన చివరి సినిమా ‘‘పాండవులు పాండవులు తెమ్మెద’’.

హైదరాబాద్ శివారులోని కొంపల్లిలో వుండే శకుంతలకు జూన్ 14వ తేదీన అర్థరాత్రి సమయంలో తన స్వగృహంలోనే గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను సూరారంలోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యులు ఆమె అప్పటికే మరణించిందని ధ్రువీకరించారు. ఈమె ఇలా అకస్మాత్తుగా మరణించడంతో యావత్ తెలుగు సినీపరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతికి గురయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles