Ileana to act with her boyfriend in happy endings movie

Ileana to act with her boyfriend in happy endings movie, happy endings movie news, ileana in happy endings movie, ileana with boyfriend andrew, ileana to act with boyfriend andrew in happy endings movie, happy endings movie news

Ileana to act with her boyfriend in happy endings movie

పెళ్లికి ముందే బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తున్న ఇల్లీ

Posted: 07/14/2014 04:36 PM IST
Ileana to act with her boyfriend in happy endings movie

(Image source from: Ileana to act with her boyfriend in happy endings movie)

గోవా బ్యూటీ ఇలియానా పెళ్లికి ముందే తన బాయ్ ప్రెండ్ తో రొమాన్స్ చేయడానికి సిద్ధమని చెబుతోంది. ఆస్ట్రేలియాలో ప్రముక ఫోటోగ్రాఫర్ అయిన ఆండ్రూతో ఈ సన్ననడుము భామ గత కొంతకాలం నుంచి చట్టపట్టాలేసుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే! ప్రస్తుతకాలంలో పెళ్లికిముందు రొమాన్స్ చేయడం కామనే అంటారా..? ఆ విషయాల గురించి అంత డీప్ గా అయితే మాకు తెలియదులెండి. తెరవెనుక వీరిద్దరి పర్సనల్ జీవితాల గురించి అంతగా తెలియదు కానీ.. తెరముందు మాత్రం ఈ జంట ఒక సినిమాలో రొమాన్స్ చేయనున్నారని సమాచారం!

ఇలియానా బాలీవుడ్ లో తాజాగా నటిస్తున్న చిత్రం ‘‘హ్యాపీ ఎండింగ్’’! అయితే ఈ సినిమాలో ఇల్లీకి తోడుగా కొన్ని సీన్స్ లలో నటించే ఓ నటుడు కోసం ఆ మూవీ దర్శకులైన రాజ్ నిడుమోరు - కృష్ణ డీకే వెతుకులాట మొదలుపెట్టారు.  అదే సమయంలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్న స్పాట్ లలో ఇల్లీ బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ తనను కలవడానికి తరచుగా వచ్చేవాడని యూనిట్ సభ్యులు పేర్కొంటున్నారు. ఆండ్రూ ప్రతిసారి ఇలియానాను కలవడానికి రావడాన్ని ఆ మూవీ దర్శకులు గమనించారు. దాంతో వారిద్దరూ తమ అన్వేషణను నిలిపివేసి, ఆండ్రూని ఇల్లీ పక్కన తమ సినిమాలో నటించాల్సిందిగా అడిగారట!

‘‘నువ్వు మా సినిమాలో ఇలియానాతో కొన్ని సన్నివేశాలలో నటిస్తావా..?’’ అని అడగగానే అతను వెంటనే ఓకే చెప్పేశాడని సమాచారం! ఈ విషయం తెలుసుకున్న ఇలియానా కూడా సంతోషంగా గంతులేయడం ప్రారంభించిందని యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి. దీంతో ఇలియానా బాయ్ ఫ్రెండ్ తన ప్రేయసితోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles