Ram gopal varma new movie titled as korika

Ram Gopal Varma new movie titled as korika, ram gopal varma latest news, ram gopal varma new movie news, ram gopal varma korika movie, korika movie first look, ram gopal varma korika movie first look poster

Ram Gopal Varma new movie titled as korika

నాలో వున్న శృంగార కళను చూపిస్తా! రాంగోపాల్ వర్మ

Posted: 07/14/2014 03:33 PM IST
Ram gopal varma new movie titled as korika

సంచలనాల డైరెక్టర్ రాంగోపాల్ వర్మ.. మరో సంచలనాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఎప్పుడూ దెయ్యాలు, పాలిటిక్స్ కు సంబంధించి చిత్రాలను తెరకెక్కించే వర్మ... తాజాగా ఓ శృంగార చిత్రాన్ని తీయనున్నట్టు తానే స్వయంగా ప్రకటించుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా అప్పుడే రిలీజ్ చేసేశాడు. హిందీలో ఈ సినిమా పేరు ‘‘XES’’ గానూ, తెలుగులో ‘‘కోరిక’’గా ఖరారు చేశాడు. ఈ టైటిల్, బ్యాక్ గ్రౌండ్ లో వున్న ఫోటోను చూస్తుంటే.. సినిమా మొత్తం సెక్స్ కాన్సెప్ట్ మీదే నడుస్తుందని వ్యక్తమవుతోంది. రాంగోపాల్ వర్మ కూడా ఇదే విషయాన్ని పేర్కొంటున్నాడు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ నాడు రాంగోపాల్ వర్మ ‘‘ఇప్పటివరకు నేను రకరకాల సినిమాలు తీశాను. కానీ శృంగార చిత్రం మాత్రం తెరకెక్కించలేకపోయాను. అందుకే ఇప్పుడు తీయనున్న మూవీలో శృంగార కాన్సెప్ట్ నే ప్రధాన అంశంగా తీసుకున్నాను’’ అని పేర్కొన్నాడు కూడా! కానీ ఈ సినిమాలో కేవలం శృంగార సన్నివేశాలు మాత్రమే ఎక్కువగా వుంటాయని, సెక్స్ ఓరియేంటెడ్ కాదని చివరికి స్పష్టం చేశాడు.

ఇదిలావుండగానే ఈ సినిమాకు సంబంధించి కొన్ని వార్తలు పుకార్లు చేస్తున్నాయి. ఇందులో ఓ 16ఏళ్ల అమ్మాయికి వర్మ హీరోయిన్ గా ఆఫర్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. అంతేకాదు.. ఆ అమ్మాయితో కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కేవలం శృంగారం అంశంగా తెరకెక్కే ఈ మూవీలో.. వర్మ 16 ఏళ్ల అమ్మాయితో అటువంటి సన్నివేశాలు ఎలా తెరకెక్కిస్తాడు..? ఒక మైనర్ అమ్మాయితో ఇటువంటి పనులు చేయించడం చట్టరీత్యా నేరం కదా..! అంటూ విమర్శలు చేసినట్టు సినీ విశ్లేషకులు చెప్పుకుంటున్నట్లు టాక్! కానీ ఈ వార్తలన్నీ ఒట్టి పుకార్లేనని కొంతమంది తోసిపుచ్చుతున్నారు.

చిన్న వయసున్న అమ్మాయిలను రాంగోపాల్ వర్మ తన సినిమాల్లో తీసుకోడని మద్దతుదారులు తెలుపుతున్నారు. ఏది ఏమైనా వర్మ తీయనున్న ఈ సినిమా.. కేవలం ఫస్ట్ లుక్ నుంచే ఇన్ని పుకార్లు వస్తుంటే.. ఇక చిత్రం షూటింగ్ పూర్తి అయ్యేంతవరకు ఇంకెన్నిరకాల పుకార్లు వస్తాయోనని అంటున్నారు. ఏదేతైనేం... రాంగోపాల్ వర్మ మళ్లీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles