Case against actor Bhanupriya, her brother నటి భానుప్రియపై కేసు.. ఏ క్షణమైనా అరెస్టు.?

Case against bhanupriya transferred to chennai police

child labour act case on bhanu priya, child labour case bhanu priya, bhanu priya brother gopala krishna, Bhanupriya, actor, minor, harassment, child labour act, pondy bazaar, Andhra Pradesh, Chennai Police, crime

The Pondy Bazaar police have registered a case against actor Bhanupriya and her brother Gopalakrishna for engaging a minor girl as domestic help and harassing her.

బాలకార్మిక చట్టం చట్రంలో భానుప్రియ.. ఏ క్షణమైనా అరెస్టు.?

Posted: 09/21/2019 09:57 AM IST
Case against bhanupriya transferred to chennai police

బాలకార్మిక చట్టంలో అనేక మార్పులను తీసుకువచ్చి అత్యంత కఠినతరం చేసినా.. ఇంకా అనేక మంది నాగరికులు, విద్యాధికుల ఇళ్లలో ఇంటి పని చేయడానికి పసిచేతులే వినియోగించుకుంటున్నారన్నది కాదనలేని సత్యం. ఇందుకు ఉదాహరణే సీనియర్ నటి భానుప్రియ. తమ ఇంట్లోంచి పపిచేసే బాలిక పలు విలువైన వస్తువులను తస్కరించిందని వీరు పోలిస్ స్టేషన్ కు వెళ్లి కేసు నమోదు చేయడంతో.. బాలిక తల్లి భానుప్రియ, అమె సోదరుడు కలసి తమ బిడ్డను ఇంట్లో నిర్బంధించి, చిత్రహింసలు పెట్టారని అరోపణలు చేయడంతో.. సీనియర్ నటి భానుప్రియ బాలకార్మిక చట్టాన్ని తుంగలో తొక్కి మైనర్ బాలికను ఇంట్లో పనికి కుదుర్చుకున్నారన్న విషయం వెలుగుచూసింది.

దీంతో ఇంటి పనికోసం బాలికను నియమించుకోవడమే కాకుండా.. బాలికను నిర్భధించి చిత్రహింసలు పెట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ నటి భానుప్రియపై చెన్నైలో కేసు నమోదైంది. చెన్నైలోని ఓ ఫ్లాట్‌లో నివసిస్తున్న భానుప్రియ ఇంటి పనికోసం ఏపీలోని సామర్లకోటకు చెందిన బాలికను నియమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఈ విషయమై సామర్లకోట పోలీసులు భానుప్రియపై కేసు నమోదు చేశారు. ఇప్పుడా కేసు చెన్నై పోలీసులకు బదిలీ అయింది.

అయితే జనవరి 19న చెన్నైలోని పాండిబజార్ పోలీసులకు నటి భానుప్రియ, ఆమె సోదరుడు గోపాలకృష్ణన్ ఫిర్యాదు చేస్తూ.. తమ ఇంట్లోని పని అమ్మాయి చోరీకి పాల్పడిందని ఆరోపించారు. బాలికపై కేసు నమోదు చేయాలని కోరారు. అయితే, బాలిక తల్లి ఆ ఆరోపణలను కొట్టి పడేసింది. తన కుమార్తెను వారు ఇంట్లో నిర్బంధించి హింసిస్తున్నారని, రక్షించాలని సామర్లకోట పోలీసులకు పిర్యాదు చేసింది. దీంతో బాలకార్మిక చట్టం కింద కేసు నమోదు చేసుకున్న సామర్లకోట పోలీసులు చెన్నై వెళ్లి భానుప్రియను విచారించారు.

మరోవైపు, చెన్నైలో భానుప్రియ పెట్టిన కేసులో ప్రభావతి, ఆమె కుమార్తెను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని విచారించారు. తాజాగా, ప్రభావతి పెట్టిన కేసును సామర్లకోట పోలీసులు చెన్నైకి బదలాయించారు. నేరం జరిగింది చెన్నైలో కాబట్టి అక్కడి పోలీసులకు అప్పగించారు. దీంతో చెన్నై పోలీసులు భానుప్రియ, ఆమె సోదరుడిపై మరోమారు బాలకార్మిక చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో వారిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bhanupriya  actor  minor  harassment  child labour act  pondy bazaar  Andhra Pradesh  Chennai Police  crime  

Other Articles