TTD making arrangements for SriVari Brahmosthavalu తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఈ నెల 29నే అంకురార్పణ

Ttd making arrangements for srivari brahmosthavalu

Lord Sri venkateshwara Swamy, SriVari Brahmosthavalu, Tirumala Temple, tirumala tirupati devasthanam, ttd news tirumala news

Tirumala Shirne diety Lord Sri Venkateshwara Swamy Brahmosthavalu to be conducted from this 29th of September to 8th of October. The newly elected TTD Board committee under the chairmanship of YV subba reddy is making allarrangements.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఈ నెల 29నే అంకురార్పణ

Posted: 09/20/2019 10:09 AM IST
Ttd making arrangements for srivari brahmosthavalu

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు వేళ అయ్యింది. ఈ నెల 30 నుంచి అంగ రంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అంతకుముందే.. సెప్టెంబర్ 24న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 29 న ఉత్సవాలకు అంకురార్పణ జరుగనుంది. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు 9 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో సింఘాల్ తెలిపారు.

29 అంకురార్పణ కార్యక్రమంతో తిరుమల బ్రహ్మోత్సవాతు ప్రారంభం జరుగుతుందని అన్నారు. సెప్టెంబర్ 30న శ్రీవారికి పట్టువస్ర్తాలు సీఎం జగన్ సమర్పిస్తారని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో 12 రకాలు, 40 టన్నుల పుష్పాలతో శ్రీవారికి అలంకరిస్తామని, బ్రహ్మోత్సవాలు నిర్వహించే 9 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రొటోకాల్ పరిధిలోని వ్యక్తులకే పరిమితమని సింఘాల్‌ చెప్పారు.

బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భారీ భద్రత ఏర్పాట్లు చేస్తోందని ఆయన వెల్లడించారు. మాడవీధుల్లో 280 సీసీ కెమెరాలు, 4వేల 200 మంది పోలీసులు, 8వేల 300 వాహనాలు పార్కింగ్ చేసేలా భద్రత ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అంతేకాదు 37 ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలను తీసుకుంటున్నామని సింఘాల్ తెలిపారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన తేదీలు:-
సెప్టెంబర్ 29న  అంకురార్పణ
సెప్టెంబర్ 30న ధ్వజారోహణ
అక్టోబర్ 4న గరుడ వాహన సేవ
అక్టోబర్ 5న స్వర్ణరథంపై శ్రీవారి ఊరేగింపు
అక్టోబర్ 7న రథోత్సవం
అక్టోబర్ 8న చక్రస్నానం, ద్వజా అవరోహనం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles