Assam: Police strip, torture 3 muslim women అక్కచెల్లెళ్లపై పోలీసుల దుశ్యాసనపర్వం..

Pregnant muslim woman sisters stripped tortured by assam police

Mahendra Sharma, Sarbananda Sonowal, Muslim woman assault, pregnant Muslim woman, pregnant woman loses baby, Minuwara Begum, Sanuwara, Rumela, crime against women, Guwahati, Darrang district, Assam, Crime

In a horrific incident, a pregnant Muslim woman and her two sisters were allegedly stripped and tortured inside a police station in Assam's Darrang district. The pregnant woman started to bleed and lost her baby, after being kicked in her stomach by a police officer.

మతాంతర ప్రేమాయణం.. అక్కచెల్లెళ్లపై పోలీసుల దుశ్యాసనపర్వం..

Posted: 09/19/2019 04:39 PM IST
Pregnant muslim woman sisters stripped tortured by assam police

మన దేశంలో పోలీసులకు అలసు నిందితులను కొట్టే అధికారం లేదని, అంతెందుకు కనీసం తిట్టే అధికారం కూడా లేదని ఓ వైపు చట్టాలు చెబుతుంటే.. చట్టం అంటే తామే అన్నట్లు.. తాము చెప్పిందే శాసనమన్నట్లు వ్యవహరించే పోలీసులు ఇంకా తమ తీరును మార్చుకోవడం లేదు. మతాంతర ప్రేమాయణం కేసు వ్యవహారంలో పోలీసులు ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరించి.. మరో వర్గానికి చెందిన అభంశుభం ఎరుగని ముగ్గురు అక్కచెల్లెళ్లపై అమానుషంగా ప్రవర్తించారు.

అసోంలోని దర్రాంగ్ జిల్లాలో పోలీసులే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు. ఈ కేసు విషయంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లను పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు వారిని వివస్త్రలను చేసి దారుణంగా చితకబాదారు. అంతేకాదు వారి రహస్య అంగాలపై కూడా పోలీసులు తమ ప్రతాపం చూపారు. మహిళల్లో ఒకరు గర్భిణి అన్న కనీస కనికరం లేకుండా లాఠీలతో చావబాదారు. దీంతో ఆమెకు గర్భస్రావమైంది. మహిళలపై దాడిచేసిన పోలీసుల్లో ఓ మహిళా కానిస్టేబుల్ కూడా ఉండడం గమనార్హం.

తమ సోదరుడు మతానికి చెందిన యువతిని ప్రేమించి అమెతో కలసి ఈ నెల 7న పారిపోతే.. తామేం తప్పు చేశామని పోలీసులు తమను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అమానుషంగా ప్రవర్తించారని బాధిత యువతుల్లో ఒకరు ఏకంగా జిల్లా ఎస్సీ కార్యాలయంలో ఈ నెల 10న పిర్యాదు చేసింది. అయితే ఈ పిర్యాదుపై నామమాత్రంగా స్పందించిన ఎస్సీ.. స్థానిక డీఎస్సీతో విచారణకు అదేశించారు. అయితే విషయం ఆనోటా ఈ నోటా మీడియా చెవిన పడటంతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది.

తమ నుదిటిపై రివాల్వర్ పెట్టిన పోలీసు ఉన్నతాధికారి తమతో తెల్లని కాయితాలపై సంతకాలు తీసుకున్నారని కూడా బాధిత మహిళ ఎస్సీకి ఇచ్చిన పిర్యాదులో పేర్కోంది. అంతేకాదు పోలీసు అధికారులు బూటుకాలితో పదే పదే తన్నడంతో గర్భవతి అయిన తన సోదరి గర్భస్రావం అయ్యిందని కూడా అవేదనను పిర్యాదులో పేర్కోంది. దీంతో మహిళల పట్ల అమానుషంగా వ్యవహరించిన పోలీసులను తక్షం విధుల్లోంచి తొలగించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. .

జిల్లా వ్యాప్తంగా నిరసనలు పెలుల్డిక్కడంతో ఎట్టకేలకు దిగివచ్చిన పోలీసులు.. స్థానిక పోలీసు అధికారి (ఎస్ఐ) తో మహిళా కానిస్టేబుల్ ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ వేటు వేశారు. అయితే రంగంలకి దిగిన జాతీయ మహిళా కమీషన్ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. బాధిత అక్కాచెల్లెళ్ల సోదరుడు గ్రామానికే చెందిన ఓ యువతిని ప్రేమించి ఆమెతో కలిసి వెళ్లిపోయాడు. వీరివి వేర్వేరు మతాలు కావడంతో వివాదం పెద్దదైంది. దీంతో యువతి కుటుంబం చేసిన ఫిర్యాదుతో బాధిత మహిళలను, వివాహిత భర్తను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన పోలీసులు వారిని చితక్కొట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahendra Sharma  Sarbananda Sonowal  Guwahati  Darrang district  Assam  Crime  

Other Articles