Low pressure in Bay of Bengal తెలుగురాష్ట్రాలకు మూడు రోజుల పాటు వర్ష సూచన

Low pressure in bay of bengal likely to bring heavy rains to telugu states

Bay of Bengal, Telangana, Telangana weather, Telangana rains, Rains in Andhra Pradesh, upper air cyclonic circulation, moderate rainfall in Telangana, Krishna, Godavari, Karnataka, Maharashtra, Uttar pradesh, Madya Pradesh, depression, Rains in Telangana, Rain Forecast

IMD predicts light to moderate rainfall tomorrow and continues three more days in Telugu states due to low pressure in bay of bengal and the impact of upper air cyclonic circulation over south Interior at bay of bengal & neighbourhood.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్ష సూచన

Posted: 09/19/2019 02:37 PM IST
Low pressure in bay of bengal likely to bring heavy rains to telugu states

తెలంగాణ వ్యాప్తంగా గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షంతో ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇక మరికొన్ని రోజులు ఇబ్బందులు తప్పేట్టు లేదు. ఎందుకంటే కోస్తాంధ్రకు సమీపంలో నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తాజాగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఇప్పటికే ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి, దీనికి తోడు అల్పపీడనం ప్రభావం కూడా తోడైతే వర్షాలు మోస్తారు నుంచి భారీ, పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. కాగా, మంగళవారం ఉదయం 8:30 గంటల నుంచి బుధవారం రాత్రి 8:30 గంటల వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. నల్గోండలో కుండపోతగా కురిసిన వర్సాలకు జాతీయ రహదారులతో పాటు రోడ్లన్ని జలమయం అయ్యాయి.

నల్గొండలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఆగకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కాల్వలు పొంగిపొర్లగా, రోడ్లు కోతకు గురయ్యాయి. కరీంనగర్ జిల్లాలోని తిర్మలాపూర్‌లో మంగళవారం కురిసిన భారీ వర్షానికి మూడువేల కోళ్లు మృతి చెందాయి. భారీ వర్షం కారణంగా యాదాద్రి కొండపై చేపట్టిన అభివృద్ధి పనులకు ఆటంకం కలిగింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీకి బుధవారం సాయంత్రం ఎగువ ప్రాంతం నుంచి 1.50 లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో 16 గేట్ల ద్వారా 1.20 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. సరస్వతి బ్యారేజీ వద్ద 11 గేట్లను ఎత్తి 49,500 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ఇక, నాగార్జునసాగర్‌కు బుధవారం రాత్రి 7 గంటల సమయంలో 68,430 క్యూసెక్కుల ప్రవాహం రాగా 4 గేట్లను ఐదు అడుగులు ఎత్తి 32,440 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles