Cops impose traffic fine on bullock cart కొత్త వాహాన చట్టం ఎఫెక్ట్.. ఎద్దుల బండికి జరిమానా..

Bullock cart owner fined rs 1000 under motor vehicles act in uttarakhand

BJP ruling stated U turn on MVI fines, MVI amendment act, New fines for traffic violations, Bullock Cart, Challan, Motor Vehicles Act, Uttarakhand, Motor Vehicles Act, Traffic Violations. Ammendment fines, States

In a shocking incident, the police fined a bullock cart owner under the Motor Vehicles Act by issuing a challan of Rs 1000. However, the challan was cancelled after cops realised that there was no provision of penalising a bullock cart under the Motor Vehicles Act

కొత్త వాహాన చట్టం ఎఫెక్ట్.. ఎద్దుల బండికి జరిమానా..

Posted: 09/18/2019 09:04 AM IST
Bullock cart owner fined rs 1000 under motor vehicles act in uttarakhand

మోటార్ వాహనాల చట్టానికి సవరణలు చేసి కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం తద్వారా వాహనదారులపై భారీ జరిమానాలు విధిస్తున్నారు పోలీసుల. ఈ క్రమంలో దీనిపై యావత్ దేశవ్యాప్తంగా అనేక విమర్శలు వెల్లివిరయడం.. షోషల్ మీడియా వేదికగా విమర్శలు తారాస్థాయికి చేరిన తరుణంలో ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. ఈ విషయమై రాష్ట్రాలదే తుది నిర్ణయమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ స్పష్టంచేశారు.

ఈ తరుణంలో రాష్ట్రాలు సవరించిన మోటార్ వాహనాల చట్టం మేరకు భారీగా పెంచిన జరిమానాలను వ్యతిరేకిస్తున్నాయి. ఇక ముఖ్యంగా బీజేపి పాలిత రాష్ట్రాల్లోనే ఈ వ్యతిరేకత మరింత అధికంగా వుందని సమాచారం. అయితే ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నా.. పోలీసులు మాత్రం ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని సామాన్యులకు నరకం చూపిస్తున్నారని చెప్పడానికి ఇప్పటికే పలు ఘటనలు రుజువుచేశాయి. నిబంధనలు ఉల్లంఘించకపోయినా ఆటోలో హెల్మెట్ పెట్టుకోలేదనీ, బైక్ పై సీటు బెల్టు పెట్టుకోలేదని, కారులో హెల్మెట్ పెట్టుకోలేదని పోలీసులు చలానాలు రాసిన ఘటనలను చూశాం.

దీంతో ప్రజలు సొంత వాహనాలను బయటకు తీయాలంటేనే వణికిపోతున్నారు. తాజాగా పొలం వద్ద ఎద్దుల బండి పెట్టుకున్నందుకు పోలీసులు ఓ రైతుకు జరిమానా విధించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ కు చెందిన హసన్ అనే రైతు తన పొలం వద్ద ఎద్దుల బండిని నిలిపిఉంచాడు. ఈ నేపథ్యంలో దాన్ని గమనించిన పోలీసులు హసన్ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నాడని అనుమానించారు. అనంతరం హసన్ ఇంటికి వెళ్లి రూ.1,000 జరిమానాను అందజేశారు.

దీంతో తిక్కరేగిన హసన్..‘అసలు ఎద్దులబండి మోటార్ వాహనాల చట్టం పరిధిలోకి ఎలా వస్తుంది?’ అంటూ తీవ్రంగా మండిపడ్డాడు. రైతు ఎదురు ప్రశ్నించడంతో తమ తప్పు తెలుసుకున్న పోలీసులు చలాన్ రద్దుచేసి అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. ఈలోగా ఈ విషయం మీడియాలో వైరల్ కావడంతో వాస్తవానికి హసన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలనీ, అయితే అతను తప్పు చేయలేదని తేలడంతో చలాన్ ను వెనక్కు తీసుకున్నామని పోలీసులు వివరణ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bullock Cart  Challan  Motor Vehicles Act  Uttarakhand  Traffic Violations. Police  

Other Articles