Are Adivasis treated as indian citizens: Pawan Kalyan అడవి బిడ్డలను భారతీయులుగా గుర్తిస్తున్నామా.?: పవన్ కల్యాణ్

Are adivasis treated as indian citizens pawan kalyan

Pawan Kalyan, Janasena, allegations, all party meet, chenchu leader, Mallikarjun, Revanth reddy, Kodandaram, Uranium, Nallamala, kadapa, pulivendula, Telangana, Andhra Pradesh, Politics

Jana Sena party President Pawan Kalyan questioned governments all the adivasis treated as citizens of india, with equal right.

ITEMVIDEOS: అడవి బిడ్డలను భారతీయులుగా గుర్తిస్తున్నామా.?: పవన్ కల్యాణ్

Posted: 09/17/2019 03:02 PM IST
Are adivasis treated as indian citizens pawan kalyan

అడవి తల్లి బిడ్డలైన చెంచులను మనం భారతీయులుగా గుర్తుస్తున్నామా.? వారికి ఫౌరులందిరికీ వర్తించే హక్కులనుకల్పిస్తున్నామా.? ఒక్కసారి అలోచించాల్సిన అవసరం ఎంతైనా వుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వాలను నిలదీశారు. ఈ మేరకు ఆయన నల్లమల అడవితల్లి నమ్ముకుని జీవితాలను సాగదీస్తున్న చెంచులకు సంబంధించిన వీడియో తన ట్విట్టర్ ఖాతాలో రిలీజ్ చేశారు.

నల్లమల యురేనియం తవ్వకాలపై అఖిలపక్ష నేతలతో క్రితం రోజున పవన్ కల్యాణ్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన విషయం తెలసిందే. ఈ సందర్భంగా అడవులను ధ్వంసం చేసి.. పర్యావరణాన్ని కలుషితం చేసి.. మానవజాతి మనుగడతో పాటు జల,జంతు, పశుపక్షాది జాతుల ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మార్చే యురేనియం మైనింగ్ తవ్వకాలను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని అన్నారు. ఆయన ప్రతిపాదనలకు అఖిలపక్ష పార్టీల నేతలు కూడా తమ గళం కలిపారు.

కాగా, ఈ సమావేశానకి చెంచు నాయకుడు మల్లికార్జున్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మల్లికార్జున్ అడవితల్లిని మా గుండెలో పెట్టుకొని చూసుకుంటామన్నారు. ఎవరు అడవిలోకి ప్రవేశించాలని తమ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కానీ ఇవాళ అడవుల్లో మాకు జీవించే హక్కు కూడా లేకుండా పోతుందన్నారు. అడవి మాకు గుండెకాయ లాంటిది. మా గుండెకాయ తీయకండి అంటూ ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

తమ తీర్మానాలు కూడా ప్రభుత్వాలు పాటించాలని.. అడవిలో వున్న ప్రతీ చెట్లు, జంతువులను తాము తమ దేవతలుగా అరాధిస్తామన్నారు. తాము ప్రతీ చెట్టు, జంతవులో కూడా దేవతల్ని కొలుస్తామన్నారు. చెంచు నాయకుడు మాట్లాడిన వీడియోను పోస్టు చేస్తూ... ‘అసలు మనం చెంచు తెగలను తోటి భారతీయులుగా గుర్తిస్తున్నామా? అని జనసేనాని పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. అసెంబ్లీలో గతంలో జరిగిన చర్చలో వారికి సంబంధించి పలు వ్యాఖ్యలు కోట్ చేశారు.

‘గిరిజనులకు ప్రజాస్వామ్యాన్ని నేర్పించాల్సిన అవసరం లేదు. వాళ్ల నుంచి మనం ప్రజాస్వామ్య విలువలను నేర్చుకోవాలి. ఈ భూమి మీద అత్యంత ప్రజాస్వామ్యయుతమైన వ్యక్తులు వారే’ అని చెప్పిన విషయాన్ని పవన్ ప్రస్తావించారు. అంతేకాకుండా యురేనియం తవ్వకాలతో జరిగి అనర్థాలపై రచించిన అణుధార్మి సత్యలు అనే పుస్తకాన్ని కూడా అఖిలపక్షం సమావేశంలో విడుదల చేశారు. యురేనియం తవ్వకాల వల్లే జరిగే నష్టాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం తప్పకుండా చదవాలని పవన్ కల్యాణ్ కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Janasena  all party meet  chenchu leader  Mallikarjun  Uranium  Nallamala  Telangana  

Other Articles