Chandrababu demands CBI probe into Kodela suicide case ఉన్మాదిలా వెంటపడ్డ ప్రభుత్వం కోడెల ఉసురు తీసింది: చంద్రబాబు

Chandrababu demands cbi probe into former ap speaker s alleged suicide case

Chandrababu, Central Bureau of Investigation, YSRCP Government, kodela siva prasad, last rites, funeral, sattenapalli, sivaram, kodela suicide, kodela shiva prasad suicide, kodela suicide, Vendetta politics, YSR Congress Party, TDP, Nara Lokesh, Chandrababu, Guntur, Vijayawada, Andhra Pradesh, Politics

TDP Chief and former Andhra Pradesh Chief Minister Chandrababu Naidu demanded a CBI inquiry into the alleged suicide of former Andhra Pradesh Speaker, Kodela Siva Prasada Rao.

ఉన్మాదిలా వెంటపడ్డ ప్రభుత్వం కోడెల ఉసురు తీసింది: చంద్రబాబు

Posted: 09/17/2019 01:17 PM IST
Chandrababu demands cbi probe into former ap speaker s alleged suicide case

మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై స్పందించిన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని అన్నారు. కోడెలపై నమోదైన కేసులపై స్పందిస్తూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. కోడెల మృతదేహానికి  ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో నివాళులర్పించిన ఆయన... పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు. కోడెల ఆత్మహత్యపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు,

కోడెల ఆత్మహత్య ఘటనపై సీబిఐ దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోలీసులపై రాష్ట్రప్రభుత్వ పెద్దల జోక్యం ఎంతలా వుందో ఈ ఘటనతో బహిర్గతం అవుతోందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్మాదిలా వెంబడించి కోడెల ఉసురు తీసిందని చంద్రాబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రమంతా భయభ్రాంతులకు గురిచేయడానికే.. ప్రజావేదికను కూల్చేశారన్నారు. తన ఇంటిని కూడా ముంచేందుకు యత్నించారని పేర్కొన్నారు.

మొత్తం తప్పుడు సమాచారాన్ని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఏ తప్పు చేయని నన్నపనేని, అచ్చెన్నాయుడుపై కేసులు పెట్టించారన్నారు. కుటుంబరావుపై తప్పుడు కేసులు బనాయించారని చంద్రబాబు పేర్కొన్నారు. కోడెలది ప్రభుత్వం చేసిన హత్య అని చంద్రబాబు ఫైర్ అయ్యారు. కోడెల మృతిపై ప్రతి ఇంట్లో, మేధావుల్లో చర్చ జరగాలన్నారు. మరే వ్యక్తికీ కోడెలలాంటి పరిస్థితి రాకూడదన్నారు.
వైసీపీ ప్రభుత్వానికి పోలీసులు.. ఆలిండియా సర్వీస్‌ ఉద్యోగులు సరెండర్‌ అయ్యారని ఆయన ఆరోపించారు. తప్పుచేసిన వాడికి శిక్ష వేస్తే నేనూ అభినందించేవాడినన్నారు చంద్రబాబు. కుమారుడు, కూతురు వేధింపుల వల్లే... కోడెల ఆత్మహత్య చేసుకున్నాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు వాపోయారు. శివరాం విదేశాల్లో కాకుండా ఇక్కడే ఉండుంటే... కోడెలను ఆయనే చంపాడని కేసులు పెట్టేవారని చంద్రబాబు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu  CBI  kodela siva prasad  last rites  TDP. YSRCP  Andhra Pradesh  Politics  

Other Articles