kancheti sai sensational allegations on Kodela suicide కొడెల శివప్రసాద్ ఆత్మహత్యపై కంచేటి సాయి అరోపణలు

Kancheti sai sensational allegations on kodela siva prasad rao suicide

Kodela Shiva Prasad, kanchete sai, sattenapalli DSP, shivaram, kodela suicide attempt, kodela shiva prasad suicide attempt, kodela suicide, Vendetta politics, YSR Congress Party, Y. S. Rajasekhara Reddy, Telugu Desam Party, Nara Lokesh, Chandrababu, Guntur, Vijayawada, Andhra Pradesh, Politics

Kodela Siva Prasada Rao, well-known politicians from the Telugu Desam Party has made suicide attempt following this his brother in law had Kancheti Sai made serious allegations on his son Sivaram.

కొడెల శివప్రసాద్ ఆత్మహత్యపై కంచేటి సాయి అరోపణలు

Posted: 09/16/2019 06:57 PM IST
Kancheti sai sensational allegations on kodela siva prasad rao suicide

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నా.. ఆయనది ఆత్మహత్యేనని పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ద్వారా తేలిందని సమాచారం. అయితే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నా తరుణంలో కొడెల మృతిపై ఆయన బావమరిది కంచేటి సాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడెలను ఆయన కుమారుడు శివరాం హత్య చేశాడని కంచేటి సాయి ఆరోపించారు.

కేవలం అరోపణలతోనే సరిపెట్టుకోని కంచేటి సాయి.. ఆయన అరోపణలపై చర్యలు తీసుకోవాలని ఏకంగా సత్తెనపల్లి డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆస్తి కోసం కోడెలను ఆయన కుమారుడు శివరాం హత్య చేశాడని వ్యాఖ్యానించారు. కోడెలను హత్య చేసిన ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూస్తున్నారని కంచేటి సాయి ఆరోపించారు. తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని కోడెల తనకు ఫోన్ చేసేవారని కంచేటి సాయి అన్నారు.

ఇదే విషయమై తనను పలుసార్లు తన దగ్గరకు కోడెల పిలిపించుకున్నారని పోలీసులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. తండ్రిని ఇబ్బంది పెట్టవద్దని తాను కూడా పలుసార్లు శివరామ్‌కు సూచించానని అన్నారు. తనని కలిసి మాట్లాడేందుకు ప్రయత్నించానని... అయితే అది కుదరలేదని వివరించారు. కోడెలకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. కోడెల మృతిపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kodela Shiva Prasad  kanchete sai  sattenapalli DSP  shivaram  TDP. YSRCP  Andhra Pradesh  Politics  

Other Articles