YS Jagan tweet on devipatnam boat capsize goes viral దేవీపట్నం ప్రమాదంపై అప్పటి జగన్ ట్వీట్ వైరల్..!

Ys jagan tweet on devipatnam boat capsize viral on net

boat capsizes in Godavari river, sight seeing boat capsizes, CM Jagan, Twitter, boat capsizes near devipatnam, boat capsizes in East Godavari, boat capsizes in Andhra Pradesh, Godavari river, sight seeing boat, devipatnam, boat capsizes, East Godavari, Andhra Pradesh, Crime

Present Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy's tweet on Devipatnam boat capsize as opposition leader goes viral onlinem now. Netigens question on the same accident occured yesterday

దేవీపట్నం ప్రమాదంపై అప్పటి జగన్ ట్వీట్ వైరల్..!

Posted: 09/16/2019 06:01 PM IST
Ys jagan tweet on devipatnam boat capsize viral on net

గోదావరిలో జరిగిన ఘోర దుర్ఘటన జరిగి, 12 మంది మృతి చెందగా, మరో 25 మందికి పైగా గల్లంతైన నేపథ్యంలో, ఏపీ సీఎం వైఎస్ జగన్ గతంలో చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు మరోసారి వైరల్ అయింది. ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతి వల్లే ఘోరాలు జరుగుతున్నాయంటూ, దేవీపట్నం లాంచీ ప్రమాదంపై జగన్ ట్వీట్ చేయగా, అప్పట్లో దాన్ని 'సాక్షి' పత్రిక ప్రచురించింది. ఇప్పుడా క్లిప్పింగ్ మరోసారి వైరల్ కాగా, సీఎం హోదాలో ఉన్న జగన్, ఏమంటారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

నాడు ప్రభుత్వ అవినీతి, నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పిన ఆయన, ఇప్పుడు కూడా అదే విషయాన్ని అంగీకరిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఆదివారం నాడు ప్రమాదం జరిగిన లాంచ్ ప్రయాణానికి అనుమతి లేదని స్వయంగా హోమ్ మంత్రి మేకతోటి సుచరిత ప్రకటించడంతో, అసలు ఈ బోటు అనుమతి లేకుండా ఎలా బయలుదేరిందని అడుగుతున్నారు. అధికారులు లంచాలు తీసుకుంటున్నారని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

గోదావరి నదిలో గాలింపు చర్యలను ముమ్మరం చేశామని, ఈ సాయంత్రానికి సహాయక చర్యలను పూర్తిచేస్తామని ఏపీ పర్యాటక శాఖామంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం పొద్దుపోయే వరకు గాలింపు చర్యలు చేపట్టిన రెస్క్యూ సిబ్బంది ఈ ఉదయం మళ్లీ సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో ధవళేశ్వరం బ్యారేజీకి ఉన్న 175 గేట్లను మూసివేశారు. గేట్లు మూసివేత వల్ల గాలింపు మరింత సులభం అవుతుందని అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Godavari river  devipatnam  boat capsizes  CM Jagan  Twitter  East Godavari  Andhra Pradesh  Crime  

Other Articles