Pawan Terms 100 Days of Jagan Rule As Anti People వైసీపీ వందరోజుల పాలన జనవిరుద్దం: పవన్ కల్యాణ్

Pawan kalyan terms 100 days of jagan rule as anti people

Pawan Kalyan, Janasena, allegations, YSRCP, YCP 100 days rule, Navaratna, Amaravati, polavaram, pawan kalyan on Sand Stock Points, Nadendla Manohar, Navallluru, Andhra Pradesh, Politics

Jana Sena party President Pawan Kalyan released a report on YCP 100 Rule quoting Ap government rule is anti people, befor this janasenani along with Nadendla Manohar visited Navalluru sand stock point to known the real fact on sand allocations.

వైసీపీ వందరోజుల పాలన జనవిరుద్దం: పవన్ కల్యాణ్

Posted: 09/14/2019 12:22 PM IST
Pawan kalyan terms 100 days of jagan rule as anti people

ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ సిపీ పాలన జనవిరుద్దంగా వుందని ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో ప్రజారోగ్యం పడకేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ రాష్ట్రంలోని 100 రోజుల వైసీపీ పాలనపై జనసేన పార్టీ నివేదికను మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విడుదల చేసింది. మొత్తం 9 అంశాలతో కూడిన 33 పేజీల నివేదికను పవన్ వెల్లడించారు.

ఇసుక విధానం, పెట్టుబడులను ఆకర్షించడంలో వైఎస్ఆర్సీపీ సర్కారు విఫలమైందని ఆరోపించారు. పోలవరం, ప్రజారోగ్యం పడేకేసిందని విమర్శించారు. ప్రభుత్వానికి పారదర్శకత, దార్శనికత లోపించిందని పవన్ ధ్వజమెత్తారు. అమరావతి, గృహనిర్మాణంపై కూడా పవన్ తన నివేదికలో చర్చించారు. మధ్యపాన నిషేధం విషయంలో ప్రభుత్వం చెబుతున్నదోక్కటి.. వాస్తవం చూస్తే మరోకటి కనిపిస్తోందని దుయ్యబట్టారు.

జగన్ సర్కారు పనితీరుపై ఏడాది వరకు మాట్లాడే అవకాశం తొలుత భావించామని, మూడున్నర నెలల్లోనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లో వ్యతిరేకతను తీసుకొచ్చాయని జనసేనాని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా నడించిందని, వీటిని అరికడతామని గతంలో చెప్పిన వైఎస్ఆర్సీపీ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు 19 లక్షల 34 వేల మంది రోడ్డునపడ్డారని దుయ్యబట్టారు. ఇసుక కొరత వల్లే వారంతా ఉపాధికోల్పోయారని, వంద రోజుల్లో ఇసుక విధానాన్ని తీసుకురాలేకపోవడం వారి అసమర్ధతకు నిదర్శనమని విమర్శించారు.

నవరత్నాలు జనరంజకమే గానీ, పాలన మాత్రం జనవిరుద్దమని ఎద్దేవా చేశారు. చౌకబారుగా కాకుండా లోతైన పరిశీలన చేసిన తర్వాతే విమర్శలు చేస్తున్నట్టు పవన్ స్పష్టం చేశారు. ఆర్ధిక శాఖపై సీఎం డ్యాష్ బోర్డులో ఎలాంటి సమాచారం లేదని, ప్రకాశం జిల్లాకు రావాల్సిన పరిశ్రమలు పక్క రాష్ట్రానికి పోతున్నాయని తూర్పారబట్టారు. శాంతి భద్రతలు క్షీణించాయని, పాఠశాలల్లో మౌలికవసతులు లేమి, దిగుబడులు తగ్గిపోయాయని నివేదికలో పవన్ వివరించారు.

టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు ఎంత దెబ్బతీశాయో, ఇప్పుడు గ్రామ వాలంటీర్ వ్యవస్థ వల్ల అంతే నష్టం జరుగుతుందని జనసేనాని విమర్శించారు. వచ్చే ఎన్నికలకు సిద్ధం చేయడం కోసం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వాలంటీర్లుగా తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. వీరు కొరియర్ సర్వీసుగా మారిపోయారని మండిపడ్డారు. టీడీపీ తీసుకువచ్చిన జన్మభూమి కమిటీలు ఆ పార్టీని నిలువునా ముంచగా, తాజాగా ఈ వాలెంటీర్ల వ్యవస్థ వైసీపీని అంతకన్న ఎక్కువ నష్టం తీసుకువస్తాయని మండిపడ్డారు.

స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు ఓ పారిశ్రామిక వేత్తను అవమానించారని.. సంస్థ ఎండీని బెదిరించి భయాందోళనకు గురిచేశారని పవన్ కల్యాన్ అన్నారు. ఇలా అయితే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని పవన్ నిలదీశారు. ఇప్పటికే పారిశ్రామిక వేత్త రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడతున్నారని అన్నారు. రాష్ట్రానికి 35 మంది వివిద దేశాల రాయభారులను పిలిచి ఏం సాధించారని, ఎన్ని పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువచ్చారని పవన్ కల్యాన్ ప్రశ్నించారు.

కృష్ణానదికి వరదలొస్తే మంత్రులు మాజీ ముఖ్యమంత్రి ఇంటిచుట్టూ తిరిగారని, అమాత్యులు బాధ్యతయుతంగా వ్యవహరించిలేదని ధ్వజమెత్తారు. మంత్రి పదవులను హనీమూన్‌లా భావిస్తున్నారని విమర్శించారు. రైతులు విత్తనాల కోసం క్యూలో నిలబడి ప్రాణాలు కోల్పోతే మంత్రులు కనీసం సానుభూతి చూపకుండా మాట్లాడటం బాధాకరమని అన్నారు. డెంగీ, మలేరియా వంటి సీజనల్‌ వ్యాధుల నివారణలో సన్నద్ధత లోపించిందని దుమ్మెత్తిపోశారు.

అంతకుముందు రాష్టంలోని ఇసుక విధానంపై ఎలా వుందన్న విషయమై క్షేత్రస్థాయిలోకి పర్యటించిన వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఇసుక కొరత ఏర్పడిన నేపథ్యంలో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు పవన్ కల్యాణ్ ఇసుక స్టాక్ పాయింట్లను పరిశీలించారు. నవులూరు ఇసుక స్టాక్ పాయింట్‌ను ఆయన నాదెండ్ల మనోహర్‌ పరిశీలించారు. ఇసుక కొరత బాగా ఉందని, ఇబ్బందులు పడుతున్నామని పవన్‌ కల్యాణ్‌కు స్థానికులు వివరించారు.

(Video Source: NTV Telugu)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Janasena  allegations  YSRCP  Sand policy  Nadendla Manohar  Andhra Pradesh  Politics  

Other Articles