vijayashanti slams TRS government on viral fever కేసీఆర్ సర్కార్ పై దేవుడిచ్చిన చెల్లలు మండిపాటు

Vijayashanti slams trs government on viral fever epidermic condition

congress campaign commitee chairman, congress leader vijayashanti, senior congress leader, Dengue fever deaths, viral fever deaths in telangana, swine flu deaths in Telangana, KTR, Harish Rao, Eetala Rajender, vijayashanti, congress leader, Dengue, viral fever, swine flu, deaths, Telengana, politics

Telangana Senior Congress leader and campaign committee chairman VijayaShanti slams TRS government interesting comments on trs party and cabinet expansion

కేసీఆర్ సర్కార్ పై దేవుడిచ్చిన చెల్లలు మండిపాటు

Posted: 09/11/2019 10:13 AM IST
Vijayashanti slams trs government on viral fever epidermic condition

తెలంగాణ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు చేసే కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి బడ్జెట్ నేపథ్యంలో చంద్రయాన్-2లో చంద్రయాన్-2లో ల్యాండర్ విక్రమ్ జాడను కనుక్కోవచ్చేమో గానీ.. కేసీఆర్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో కేటాయింపులకు సంబంధించిన వాస్తవాలను కనుక్కోవడం ఎవరి తరం కాదేమో అనే అనుమానం కలుగుతోందటూ ఎద్దేవా చేశారు. అక్షరాస్యత కల్పించడంలో తెలంగాణ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అట్టడుగులో ఉందని అమె విమర్శించారు. రాష్ట్రంలో విజృంభించిన విష జ్వరాలు, యూరియా కొరతతో రైతులు పడ్డ ఇబ్బందులపై ఆమె ప్రభుత్వాన్ని విమర్శించారు.

తాజాగా, మంత్రివర్గ విస్తరణతో టీఆర్ఎస్ నేతల్లో పెరిగిన అసంతృప్తిపై విజయశాంతి ఫేస్‌బుక్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసస గళాన్ని ప్రస్తావిస్తూ.. ప్రస్తుతం తెలంగాణలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే.. 19 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు కేబినెట్‌ను విస్తరించిన తర్వాత తలెత్తిన అసమ్మతి గుర్తుకు వస్తోందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘అప్పటివరకు తనకు తిరుగులేదు అనుకున్న చంద్రబాబుకు, అప్పట్లో జరిగిన కేబినెట్ విస్తరణ తర్వాత గడ్డు రోజులు మొదలయ్యాయి. తనకు మంత్రి పదవి దక్కక పోవడంతో కేసీఆర్ గారు తిరుగుబాటు చేయడం... చివరకు అది టీడీపీ ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చిన వైనాన్ని ఎవరూ మర్చిపోలేరు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు చూస్తున్న వారందరికీ కూడా, గతంలో చంద్రబాబు గారికి ఎదురైన అనుభవమే ఇప్పుడు కేసీఆర్ గారికి కూడా ఎదురు అవుతుందన్న అభిప్రాయం కలుగుతోంది.’ అంటూ విజయశాంతి పేర్కొన్నారు.

మొదటినుంచి టిఆర్ఎస్‌ను అంటిపెట్టుకున్న తమను విస్మరించారు అన్న అసమ్మతి ఓవైపు... పదవుల కోసం పార్టీ మారిన తమను పట్టించుకోలేదన్న అసహనం మరోవైపు.. మొత్తంమీద కేసీఆర్ గారి పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా మారిందంటూ సెటైర్లు వేశారు. నా మాటే శాసనం అనుకున్న కేసీఆర్‌కు వ్యతిరేకంగా ధిక్కార స్వరాలను వినిపించేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆపార్టీ నేతలు ఏమాత్రం వెనకాడటం లేదన్నారు.

అసమ్మతి గళం వినిపిస్తున్న నేతలను బెదిరించి... వారితో తనకు మద్దతుగా ప్రకటనలు చేయించుకుంటూ కేసీఆర్ సంక్షోభ నివారణకు ప్రయత్నాలు చేయవచ్చు కానీ.. రోజురోజుకు పెరిగే అసంతృప్తిని అడ్డుకోవడం ఆయన తరం కాదని విజయశాంతి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్‌లో వినిపిస్తున్న నిరసన గళాన్ని చూస్తూ ఉంటే.. గతంలో మాదిరిగా కేసీఆర్ పేరు చెబితే భయపడే రోజులు పోయాయనే విషయం స్పష్టంగా అర్థం అవుతోందని పేర్కొన్నారు.

‘తను కనుసైగ చేస్తే వణికిపోయే పరిస్థితి నుంచి.. తనకు వ్యతిరేకంగా మాట్లాడే స్థాయికి టీఆర్ఎస్‌లో అసమ్మతి వర్గం పెరుగుతోంది అంటే.. దాని వెనక ఉన్న అదృశ్య శక్తి ఏమిటో కేసీఆర్ కు ఇప్పటికే అర్థమై ఉంటుంది’ ఫేస్ బుక్ లో రాసుకొచ్చారు. కాంగ్రెస్, టీడీపీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి, సంబరపడిన గులాబీ బాస్‌కు ఇప్పుడు అదే అనుభవం బీజేపీ రూపంలో పునరావృతం అవుతుంది అనే వాదన వినిపిస్తోందన్నారు. రోజువారి పరిణామాలు కూడా ఈ వాదాన్ని బలపరిచే విధంగానే ఉన్నాయంటూ విజయశాంతి అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vijayashanti  congress leader  Dengue  viral fever  swine flu  deaths  Eetala Rajender  Telengana  politics  

Other Articles

 • Kodela siva prasada rao last rites to be conducted tomorrow

  కొడెల శివప్రసాద్ అంత్యక్రియల్లో సందిగ్థత..

  Sep 16 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరాం తన తండ్రి మరణవార్త తెలుసుకుని గుంటూరుకు తిరుగుప్రయాణమయ్యారు. రేపటిలోగా ఆయన గుంటూరుకు చేరుకుంటారని మాజీ మంత్రి, టీడీపి నేత... Read more

 • Kancheti sai sensational allegations on kodela siva prasad rao suicide

  కొడెల శివప్రసాద్ ఆత్మహత్యపై కంచేటి సాయి అరోపణలు

  Sep 16 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నా.. ఆయనది ఆత్మహత్యేనని పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ద్వారా తేలిందని సమాచారం. అయితే రకరకాల ఊహాగానాలు... Read more

 • Ys jagan tweet on devipatnam boat capsize viral on net

  దేవీపట్నం ప్రమాదంపై అప్పటి జగన్ ట్వీట్ వైరల్..!

  Sep 16 | గోదావరిలో జరిగిన ఘోర దుర్ఘటన జరిగి, 12 మంది మృతి చెందగా, మరో 25 మందికి పైగా గల్లంతైన నేపథ్యంలో, ఏపీ సీఎం వైఎస్ జగన్ గతంలో చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు మరోసారి... Read more

 • Reason behind boat capsize in river godavari dozens still missing

  గోదావరి నదిలో లాంచీ ప్రమాదానికి కారణం అదేనా.?

  Sep 16 | పాపికొండలు విహార యాత్రలో విషాదం చోటు చేసుకున్న ఘటనలో విస్మయకర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. గోదావరి నదిలో 5 లక్షల క్యూసెక్కుల భారీ వరద ప్రవాహం ఉన్నప్పటికీ.. పర్యాటకుల బోటుకు ఎలా అనుమతి ఇచ్చారనే... Read more

 • Ap bjp president kanna laxminarayana taken into custody

  కన్నాను అడ్డుకున్న పోలీసులు.. సభకు అనుమతి నిరాకరణ

  Sep 16 | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సత్తెనపల్లి పోలీసు స్టేషన్ కు తరలించారు. గురజాలలో బహిరంగ సభను నిర్వహించడానికి బీజేపీ ప్రయత్నించగా ఆ సభకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.... Read more

Today on Telugu Wishesh