locals caught by drunken driving police constable పీకల వరకు తాగి వాహనం నడిపిన కానిస్టేబుల్..

Drunken driving police constable caught by locals in telangana

police constable, drunk and driving, locals, traffic rules violation, viral video, B,Shanker, telangana, crime

drunken constable driving his vehicle without wearing helmet violatiing traffic rules was caught by locals. Even after locals objection he drew his vehicle in Telangana

పీకల వరకు తాగి వాహనం నడిపిన కానిస్టేబుల్..

Posted: 09/10/2019 06:45 PM IST
Drunken driving police constable caught by locals in telangana

తప్పతాగి తూలుతూ బైక్ నడుపుతున్న ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను స్థానికులు అడ్డుకున్న ఘటన తెలంగాణలో వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూటుగా మద్యం తాగిన సదరు కానిస్టేబుల్ ఊగుతూ, జోగుతూ బైక్‌ డ్రైవ్ చేస్తున్న దృశ్యాలను వీడియోలో గమనించవచ్చు. కానిస్టేబుల్ మద్యం తాగి ప్రమాదకరంగా బైక్ నడుపుతున్న విషయాన్ని గమనించిన స్థానికుడొకరు ఆయణ్ని వెంబడించి అడ్డుకున్నారు.

సదరు కానిస్టేబుల్‌ను ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించగా.. హెడ్‌క్వార్టర్‌కు అంటూ బదులిచ్చాడు. బైక్ పక్కన నిలిపేసి ఆటోలో వెళ్లాలంటూ కానిస్టేబుల్‌కు సూచించారు. అటుగా వస్తున్న ఆటోను ఆపి అందులో వెళ్లాలని చెప్పారు. బైక్ తమ కుర్రాడు తీసుకొస్తాడని తెలిపారు. అయితే.. అందుకు నిరాకరించిన కానిస్టేబుల్.. ‘నేనేమన్నా డ్యాష్ ఇచ్చానా?’ అంటూ వారిని ప్రశ్నించడం గమనార్హం.

యూనిఫాంలో ఉండి కూడా ఫూటుగా తాగడమే కాకుండా.. ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తూ ఏం కాలేదంటావా? అని స్థానికులు ప్రశ్నించారు. తాగి డ్రైవింగ్ చేయడమే కాకుండా అతడు హెల్మెట్ కూడా ధరించకపోవడం గమనార్హం. అయితే.. ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుందనే విషయం తెలియాల్సి ఉంది. సదరు కానిస్టేబుల్ యూనిఫాంపై బి. శంకర్ అని పేరు ఉంది. ఆయన నడిపిన బైక్ ‘TS 26 A5208’ నంబర్‌తో రిజిస్టరై ఉంది.

కేంద్ర ప్రభుత్వం ఓ వైపు కొత్త వాహన చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ‘భరత్ అనే నేను’ సినిమా స్టైల్లో ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వారిపై భారీగా జరిమానాలు విధిస్తున్నారు. కొత్త నిబంధనలతో వాహనదారులు హడలిపోతున్నారు. అయితే.. నిబంధనలు అతిక్రమిస్తే పట్టుకోవాల్సిన పోలీసులే తరచూ రూల్స్ ఉల్లంఘిస్తూ కెమెరా కళ్లకు చిక్కుతుండటం హాట్ టాపిక్‌గా మారింది. మద్యం తాగి ప్రమాదకరంగా బైక్ నడిపిన సదరు కానిస్టేబుల్‌పై పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : police constable  drunk and driving  locals  traffic rules violation  viral video  B  Shanker  telangana  crime  

Other Articles