22 gates of Sagar lifted due to heavy inflow నాగార్జున సాగర్ కు జలకళ.. 22 గేట్లు ఎత్తేవేత..

Nagarjuna sagar dam gates lifted due to heavy inflow

Nagarjuna Sagar, Sagar Gates Lifted, heavy flow into Sagar, Srisailam Project, rain in Maharashtra, rain in karnataka, rain in Telangana, rain in Andhra Pradesh, Andhra Pradesh

Officials of Nagarjunasagar releasing 2lakh cusecs water to downstream by lifting 22 gates of the project at a height of 10 feet as the inflows of the project reached to 4 lakh cusecs from upper stream( Srisailam dam).

నాగార్జున సాగర్ కు జలకళ.. 22 గేట్లు ఎత్తేవేత..

Posted: 09/10/2019 03:36 PM IST
Nagarjuna sagar dam gates lifted due to heavy inflow

నాగార్జున సాగర్‌ డ్యామ్‌కు మళ్లీ జలకళ సంతరించుకుంది. ఇటీవలే భారీగా వచ్చిన వరద ప్రవాహంతో మొత్తం 26 గేట్లను ఎత్తిన అధికారులు వరద ఉదృతి తగ్గడంతో కొద్ది రోజుల తరువాత గేట్లను మూసేశారు. తాజాగా ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్రా, కర్ణాటకలలో కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం డ్యాంకు మరోమారు వరద ఉదృతి పెరడంతో నాగార్జునసాగర్ లో గంట గంటకు నీటి మట్టం పెరుగుతోంది. దీంతో మంగళవారం అధికారులు సాగర్ డ్యామ్ 23 గేట్లను తెరిచారు.

క్రస్ట్ గేట్లను 10 మీటర్ల మేర ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 3 లక్షల 77వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. దీంతో సుమారు 2 లక్షల 94వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. సాగర్ డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 589.70 అడుగులకు చేరుకుంది. మొత్తం 312 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న నాగార్జున సాగర్‌లో ప్రస్తుతం 310 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

సాగర్ గేట్లు ఎత్తగానే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని అధికారులు ప్రకటించారు. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో మంగళవారం ఉదయం కొద్దిసేపు స్పిల్ వే నుంచి కాకుండా కొన్ని గేట్లపై వరద నీరు ప్రవహించింది. అప్రమత్తమైన అధికారులు వెంటనే గేట్లను సరిచేశారు.

శ్రీశైలం డ్యామ్‌లోని 6 గేట్లను సుమారు 17 మీటర్ల మేర ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. ఈ వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే మొత్తం 26 గేట్లు తెరిచే సూచనలు కన్పిస్తున్నాయి. దీంతో రెండు మూడు రోజుల్లో వరుస సెలవులు ఉన్న నేపథ్యంలో పర్యాటకులు సందర్శించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles