TRS MLA Padma Devender Reddy Faces Bad Experience మాజీ డిప్యూటీ స్పీకర్ కు పరాభవం.. వర్గపోరే కారణమా.?

Trs mla padma devender reddy faces bad experience at governor farewell meeting

former dy speaker bad experiance at pragati bhavan, padma devender reddy bad experiance at pragati bhavan, CM camp office, padma devender reddy, Esl Narasihan, Pragati Bhavan, CM KCR, Harish Rao, Telangana, Politics

TRS MLA Padma Devender Reddy Faces Bad Experience at Governor Farewell Meeting, when she her vehicle was not allowed inside Pragati Bhavan by Officials.

ITEMVIDEOS: మాజీ డిప్యూటీ స్పీకర్ కు పరాభవం.. వర్గపోరే కారణమా.?

Posted: 09/07/2019 05:45 PM IST
Trs mla padma devender reddy faces bad experience at governor farewell meeting

తెలంగాణ క్యాబినెట్ లో ఒక్క మహిళా ఎమ్మెల్యేకు కూడా స్థానం కల్పించలేదన్న విమర్శలు తొలి మలి ప్రభుత్వంలోనూ వినిపిస్తున్న క్రమంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా తొలి టీఆర్ఎస్ ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వర్తించిన పద్మ దేవేందర్ రెడ్డికి ప్రగతి భవన్ వద్ద పరాభవం ఎదురైంది. తమ పార్టీ నేతృత్వంలో గవర్నర్ నరసింహన్ కు వీడ్కోలు పలికే సభను ఏర్పాటు చేస్తున్న క్రమంలో హాజరయ్యేందుకు వెళ్తున్న ఆమెను చేదు అనుభవం ఎదురైంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి సుదీర్ఘకాలం గవర్నర్ గా సేవలు అందించిన నరసింహన్ కు ఘనంగా వీడ్కోలు పిలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదులోని ప్రగతి భవన్ లో వీడ్కోలు సభను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో, ప్రగతి భవన్ కు మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు చేరుకుంటున్నారు. మాజీ ఢిప్యూటీ స్పీకర్ గా, ఎమ్మెల్యేగా పద్మా దేవేందర్ రెడ్డికి కూడా హాజరయ్యేందుకు వెళ్లగా అమెను ప్రగతిభవన్ భద్రతాధికారులు అడ్డుకున్నారు.

ఈ కార్యక్రమానికి కేవలం మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు మాత్రమే అనుమతి ఉందని... ఎమ్మెల్యేలకు అనుమతి లేదని భద్రతాధికారులు  స్పష్టం చేశారు. దీంతో అమె షాక్ కు గురైంది. కాసేపు అక్కడే వేచివుండి ఆనంతరం వెనుదిరిగింది. అయితే అదే సమయంలో అటు మంత్రి, ఇటు అధికారి హోదా కూడా లేని కేవలం గత పార్లమెంటు ఎన్నికలలో అధికారి అభ్యర్థిగా బరిలోకి దిగిన తలసాని సాయి శ్రీనివాస్ మాత్రం గవర్నర్ వీడ్కోలు కార్యక్రమానికి హాజరుకావడం కొసమెరుపు. దీంతో టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరుకు తెరలేచిందా.? అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CM camp office  padma devender reddy  Esl Narasihan  Pragati Bhavan  CM KCR  Harish Rao  Telangana  Politics  

Other Articles