Lion caught eating grass in Gujarat's Gir forest ఆకలేస్తే సింహం ఏం తింటుంది..? మృగరాజు గడ్డి కరిచాడు..

Video of lion eating grass in gujarat s gir forest goes viral surprises netizens

lion eating grass video, lion grass plant, can lion survive without meat, lion dont eat grass, lion grass plant, what do lions eat, are lions omnivores, tiger eat grass, lion grass video, viral animal videos, lion gir forest, gir gujarat, Lion eating grass, viral video, Gir Forest, Omnivores, video viral, netizens, Gujarat

A video of a lion eating grass in a forest area of Khambha in Amreli district of Gujarat has gone viral on social media. The video which has surprised netizens shows the big cat eating grass and then puking it.

ITEMVIDEOS: ఆకలేస్తే సింహం ఏం తింటుంది..? మృగరాజు గడ్డి కరిచాడు..

Posted: 08/29/2019 02:22 PM IST
Video of lion eating grass in gujarat s gir forest goes viral surprises netizens

ఇటీవల తెలుగు సినిమాలతో పాటు అటు బాలీవుడ్ సినిమాల్లో కూడా పాపులర్ అయిన డైలాగ్.. ఎంత ఆకలేసినా.. సింహం గడ్డి తినదు అన్నది. కానీ సింహం కూడా గడ్డి తినేసి సాధు జంతువులా మారిపోతోందంటే నమ్ముతారా.? చాల్లే.. చెప్పొచ్చారు  సింహం ఎక్కడైనా గడ్డి కరుస్తోందా.? అంటారా. అది అసలే అడవికి రాజు. అంతగా తిండి దొరక్కపోతే ఆకలితో అలమటిస్తుంది కానీ గడ్డి తింటుందా? అని కొట్టిపారేయకండి. ఇంకా అవకాశముంటే పైన చెప్పిన డైలాగే తిప్పి అప్పగిస్తామంటారా.? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే.

మృగరాజు గడ్డిని తింటుంది. ఇది వాస్తవం. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుజరాత్ లోని ఖంబా అడవుల్లో ఈ వీడియో అక్కడి స్థానికులకు చిక్కింది. గుజారాత్ లోని అమ్రేలీ జిల్లా ఖంభా అటవీ ప్రాంతంలో ఓ సింహం ఇలా పచ్చ గడ్డి మేస్తూ కనిపించింది. అయితే సింహం తింటుందన్నది స్పష్టంగా కనిపిస్తున్నా..? దేనిని తింటుందన్నది తెలియక తికమకపడ్డ స్థానికులు తమ సెల్ ఫోన్ తీసి.. కెమెరాలతో జూమ్ చేసి చూశారు. మృగరాజు ఏకంగా గడ్డి మేస్తుండటంతో చూసిన వారు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విపరీతంగా వైరల్ అవుతోంది.

సింహాలు గడ్డి తినడం చాలా అరుదైన ఘటన అని షెత్రుంజి రేంజ్ ఫారెస్ట్ డిప్యూటీ కన్జర్వేటర్ (డీసీఎఫ్) సందీప్ కుమార్ తెలిపారు. అయితే, వాటి కడపులో ఏదైనా ఇబ్బందిగా ఉంటే వాంతులు చేసుకునేందుకు అప్పుడప్పుడు గడ్డి తింటుంటాయని పేర్కొన్నారు. పచ్చిమాంసం కొన్నిసార్లు వాటి జీర్ణక్రియను ఇబ్బంది పెడుతుందని, అటువంటి సమయంలో దానిని మళ్లీ బయటకు పంపేందుకు ఇలా గడ్డి తింటాయని వివరించారు. అంతేగా మరి సింహం సాధు జంతువుగా ఎలా మారుతుంది. మాంసాహారి శాఖాహారిగా ఎలా మారుతారని కూడా నెట్ జనులు పేర్కోంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lion eating grass  viral video  Gir Forest  Omnivores  video viral  netizens  Gujarat  

Other Articles