Pilot Records Selfie Video After Plane Crash విమానం క్రాష్.. సెల్పీ వీడియో తీసిన పైలట్

Pilot records selfie video after plane crashes in pacific ocean

aircraft crash, aerial photo shoot, california, half moon bay, San Francisco, Pacific Ocean, pilot selfie video, passengers thrilled with air crash

A plane crashing into the Pacific Ocean during an aerial photo shoot involving two aircraft. One of planes during the shoot malfunctioned and crashed near Half Moon Bay, about 9 miles from San Francisco.

ITEMVIDEOS: సముద్రంలో విమానం క్రాష్.. నవ్వుతూ సెల్పీలు దిగిన ప్రయాణికులు

Posted: 08/22/2019 08:45 PM IST
Pilot records selfie video after plane crashes in pacific ocean

తాము ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలిపోతుందని తెలిస్తే.. ఎవరైనా అందోళనకు చెందుతారు. ఇక ఇవే తమకు చివరి క్షణాలని కూడా భావిస్తారు. నమ్మినవారు. నమ్మనివారు అంతా దేవుణ్ణి ప్రార్థించి, తమను కాపాడమని, లేదా విమానం క్రాష్ కాకుండా చూడాలని మొక్కుతారు. కానీ ఈ విమానంలోని ప్రయాణికులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. నవ్వుకుంటూ సెల్ఫీలు తీసుకున్నారు. పైలట్‌తో సహా అంతా ఉల్లాసంగా కనిపించారు. ఇదేం చోద్యం అనుకుంటున్నారా?

ఇదిగో ఈ వీడియో చూస్తే మీరు కూడా షాకవుతారు. ప్రమాదాన్ని కూడా వీరు పండగలా ఫీలవ్వుతున్నారే అని ఆశ్చర్యపోతారు. ఓవెన్ లైపెల్ట్ అనే పైలట్ బీచ్‌క్రాఫ్ట్ బొనాంజ అనే లైట్ ఎయిర్ క్రాఫ్ట్‌లో ప్రయాణికులతో విహారానికి బయల్దేరాడు. మార్గ మధ్యలో ఆ విమానం ఇంజిన్ ఫెయిలైంది. దీంతో విమానాన్ని నేరుగా పసిఫిక్ మహాసముద్రంలో ముంచేశాడు. అనంతరం మునిగిపోతున్న ఎయిర్ క్రాఫ్ట్‌తో సెల్ఫీలు తీసుకున్నాడు.

మరోవైపు ప్రయాణికులు సైతం ప్రమాదాన్ని ఎంజాయ్ చేయడం కనిపించింది. నీటిలో తేలుతూ సెల్ఫీ వీడియోల్లో మాట్లాడుతూ.. సరదాగా గడిపేశారు. ఈ ప్రమాదం కాలిఫోర్నియాకు తొమ్మిది మైళ్ల దూరంలోనే జరిగింది. దీంతో రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని నీటిలో లైఫ్ జాకెట్ల సాయంతో తేలుతున్న ప్రయాణికులను, పైలట్‌ను రక్షించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aircraft crash  aerial photo shoot  california  half moon bay  San Francisco  Pacific Ocean  

Other Articles