raj tarun reponds on the accident through Twitter కారు ప్రమాదంపై స్పందించిన హీరో రాజ్ తరుణ్

After close shave hero raj tarun reponds on the accident through twitter

Raj Tarun denies causing an accident!, Raj Tarun, Accident, Volvo Car, Dil Raju, Suresh Babu, Outer ring Road, Hyderabad, Crime news

Tollywood Hero Raj Tarun, who is on the run after the the accident near Narsingi Outer Ring Road, finally responded on the accident and said that the accident caused due to sharp right turn, which made him to loose control over the speeding car. Yesterday in a statement raj tarun had denied of involving in road accident.

కారు ప్రమాదంపై స్పందించిన హీరో రాజ్ తరుణ్

Posted: 08/21/2019 11:24 AM IST
After close shave hero raj tarun reponds on the accident through twitter

నార్సింగిలోని ఔటర్ రింగ్ రోడ్డులో కారు ప్రమాదం తర్వాత నటుడు రాజ్ తరుణ్  అజ్ఞాతంలోకి వెళ్లడు. ఆయన ఎక్కడున్నాడు.. ఎలా వున్నాడు.. గాయాలేమైనా తగిలాయా అని అతని అభిమానులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్ నుంచి తిరిగివస్తున్న రాజ్ తరుణ్ కారు మార్గమధ్యంలో డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో కారును అక్కడే వదిలిపెట్టిన రాజ్ తరుణ్ పారిపోవడం సీసీటీవీలో రికార్డయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఈ నటుడిపై ర్యాష్ డ్రైవింగ్, పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసులు నమోదుచేశారు. అలాగే కారు యజమాని ప్రదీప్ ను విచారణకు హాజరుకావాల్సిందిగా సమాచారం అందించారు.

కాగా, ఈరోజు ప్రదీప్ ను విచారించిన అనంతరం అతను ఇచ్చే సమాచారాన్ని బట్టి విచారణలో ముందుకెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు నార్సింగి రోడ్డు ప్రమాదంపై హీరో రాజ్ తరుణ్ ఎట్టకేలకు స్పందించాడు. తన యోగక్షేమాలు తెలుసుకోవడానికి చాలామంది కాల్స్ చేస్తున్నారనీ, ఇంత మంది ప్రేమను పొందినందుకు తాను అదృష్టవంతుడినని రాజ్ తరుణ్ తెలిపాడు. నార్సింగి సర్కిల్ లో గత 3 నెలలుగా చాలా ప్రమాదాలు జరిగాయని రాజ్ తరుణ్ గుర్తుచేశాడు. కారు ప్రమాదం అనంతరం తాను అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నానని చెప్పాడు. ఈ సర్కిల్ లో ఒక్కసారిగా కుడివైపు టర్న్ తీసుకోవాల్సి వచ్చింది. దీంతో కారు వేగాన్ని నియంత్రించడంలో తాను విఫలమయ్యానని తెలిపారు. దీంతో  కారు ఒక్కసారిగా వెళ్లి పక్కనే ఉన్న గోడను బలంగా ఢీకొట్టిందని చెప్పాడు.

అప్పుడు వచ్చిన శబ్ధానికి నా రెండు చెవులు పనిచేయలేదు. చూపు కూడా సరిగ్గా కనిపించలేదు. గుండె దడ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ ఘటన జరిగినప్పుడు నేను సీట్ బెల్ట్ పెట్టుకునే ఉన్నాను. నాకు దెబ్బలేమీ తగలలేదని నిర్ధారించుకున్నాక కారు నుంచి బయటపడ్డాను. ఆ ఆందోళనలో ఇంటికి పరుగెత్తుకుంటూ వెళ్లాను. ఆరోజు రాత్రి జరిగింది ఇదే. మిగిలిన విషయాలు త్వరలోనే బయటకు వస్తాయి. త్వరలోనే మళ్లీ సినిమా షూటింగులో పాల్గొంటాను. మీ ప్రేమకు ధన్యవాదాలు’ అని రాజ్ తరుణ్ ట్వీట్ చేశాడు. సీటు బెల్టే ప్రమాదం నుంచి తనను కాపాడిందనీ, సీట్ బెల్ట్ ధరించాలని సూచించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raj Tarun  Accident  Volvo Car  Dil Raju  Suresh Babu  Outer ring Road  Hyderabad  Crime  

Other Articles