ఔటర్ రింగ్ రోడ్డ్ కారు ప్రమాదానికి గురైన ఘటనలో యువ హీరో రాజ్ తరణ్ ఎలా వున్నారని ఆయన అభిమానులు అందోళనకు గురవుతున్నారు. తొలుత ఈ ప్రమాదానికి గురైన కారులో ఉన్నది హీరో తరుణ్ అని వార్తలు వచ్చాయి. అయితే అందులో వున్నది తరుణ్ కాదని, మరో హీరో రాజ్ తరుణ్ అని పోలీసులు సిసి కెమెరాలను చూసి నిర్థారించారు. ప్రమాదం తరువాత స్వల్ప గాయాలతో బయటపడిన రాజ్ తరుణ్, పరుగెత్తుకుంటూ వెళ్లి మరో కారులో వెళ్లిపోయారని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు వివరించారని సమాచారం.
కారులో వున్నది రాజ్ తరుణ్ అని తేలడంతో అయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. యాక్సిడెంట్ తరువాత రాజ్ తరుణ్ ఎక్కడికి వెళ్లాడన్న విషయం ఇంకా తెలియరాలేదు. రాజ్ తరుణ్ తన వాల్వో కారు (టీఎస్ 09 ఈఎక్స్ 1100)లో హైదరాబాద్ కు వస్తున్న వేళ, అల్కాపూర్ దగ్గర కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిందని సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలిని సందర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అయితే తాను కారు ప్రమాదానికి గురయ్యానన్న వార్తను హీరో రాజ్ తరున్ తోసిపుచ్చారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తన కారు ప్రమాదానికి గురికాలేదని, తన కారు తన ఇంట్లోనే భద్రంగా వుందని పేర్కోన్నారు. అయితే తన కారు ఇంట్లోను వుందని పేర్కోంటున్నా.. రోడ్డు ప్రమాదం తనతోనే జరిగిందా.? లేదా.? అన్న విషయాన్ని మాత్రం చెప్పకపోవడం కొసమెరుపు. ఇదిలావుండగా.. ప్రస్తుతం రాజ్ తరుణ్ ఎక్కడ ఉన్నాడన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more