Imran Khan Shows Up When Searching For ‘Bhikari' పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. బికారియేనా.?

Pakistan prime minister imran khan shows up when searching for bhikari

Google, Google CEO, Google Images, Imran Khan, Prime Minister Imran Khan, Prime Minister of Pakistan, Saudi arabia, UAE, China, Malaysia, monetary support, Bikari, beggar, politics

pakistan PM Imran Khan, was recently involved in a bit of controversy when his detractors labelled him as a ‘bhikari‘ aka ‘beggar’.

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. బికారియేనా.?

Posted: 08/19/2019 01:59 PM IST
Pakistan prime minister imran khan shows up when searching for bhikari

జమ్మూకాశ్మీర్ లో ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించి ఆ ప్రాంతవాసులకు కూడా యావత్ భారత దేశ ప్రజలు అనుభివిస్తున్న స్వేచ్ఛా వాయువును అందించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో పాటు పారిశ్రామీకరణకు దూరంగా వున్న ఈ ప్రాంతాన్ని వాణిజ్య, వ్యాపారాలవేత్తలు తమ శాఖలను కొనసాగించేలా చేయడంతో అగ్గిమీద గుగ్గిలం అవుతుంది పాకిస్థాన్. ఈ క్రమంలో తమకు చైనా తప్ప మరే దేశం స్నేహహస్తాన్ని అందించకపోవడంతో.. ఒంటరైన పాకిస్థాన్ లోని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మరో శరాఘతాన్ని ఎదుర్కోంటోంది.

కొద్దిరోజుల క్రితం బెస్ట్ టాయిలెట్ పేపర్ అని గూగుల్‌లో టైప్ చేయగానే పాకిస్తాన్ జాతీయ జెండా కనిపించేది. అదే పంథాలో ఇప్పుడు బికారీ అని సెర్చ్ చేస్తుంటే పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్ వస్తున్నాడు. దీనికి కారణం పాక్‌లోనూ ఇమ్రాన్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతుండటమే. ఇటీవల ఆయన తమకు ఆర్థిక సాయం చేయాలంటూ పలు దేశాల పర్యటనలు చేసి రిక్త హస్తాలతో వెనక్కు రావడమే కారణమని వార్తలు వినబడుతున్నాయి. ఇటీవల ఆయన సౌదీ అరేబియా, యుఏఈ, మలేసియా, చైనా దేశాలను పర్యటించిన విషయం తెలిసిందే.

ఇక దీంతో పాటు వారం క్రితం ఓ పాక్ వ్యక్తి ..'3-4రోజుల్లో పండుగ ఉంది. మార్కెట్లో కూరగాయాలు కనిపించడం లేదు. భారత్ నుంచి వచ్చే ఉల్లిపాయలు, కూరగాయాల మీద ఆధారపడ్డ వాళ్లం. ఇప్పుడు పండుగకు అవేం లేకపోతే మేమేం తినాలి. గడ్డి తినమంటారా'? అని ఇమ్రాన్ ను ప్రశ్నించాడు. ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవలే ఆర్టికల్ 370రద్దుపై పాక్ ప్రభుత్వ వైఖరిని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. ఆర్టికల్ 370ని మళ్లీ పరిశీలించాలంటూ చేస్తున్న వాదనపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పుల్వామా ఉగ్రదాడి అనంతరం పాక్‌పై విమర్శల పర్వం మొదలైంది. అప్పటి నుంచే బెస్ట్ టాయిలెట్ పేపర్ పాక్ జాతీయ జెండా అని గూగుల్ లో కనిపించడం మొదలైంది. గతేడాది నెట్టింట్లో ఇడియట్ అనే పదాన్ని సెర్చ్ చేస్తే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫొటో వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles