Arun Jaitley on life support; leaders visit him at AIIMS అరుణ్ జైట్లీ ఆరోగ్యం మరింత విషమం..

Arun jaitley continues to be critical on life support

arun jaitley, arun jaitley latest news, arun jaitley health, arun jaitley age, arun jaitley health news, arun jaitley health update, arun jaitley live news, arun jaitley latest news, health condition, AIIMA, nitish kumar, piyush goyal, new delhi

A multidisciplinary team of doctors is monitoring former finance minister Arun Jaitley health condition, who has been put on the life support system. The AIIMS has not released any medical bulletin on his health condition since August 09.

అరుణ్ జైట్లీ ఆరోగ్యం మరింత విషమం.. ఎయిమ్స్ కు బీజేపి నేతలు

Posted: 08/18/2019 12:11 AM IST
Arun jaitley continues to be critical on life support

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత అరుణ్ జైట్లీ ఆరోగ్యం మరింత విషమించింది. ఆయన కిడ్నీలు, ఊపిరితిత్తులు కూడా సక్రమంగా పనిచేయడం లేదని వైద్యులు అంటున్నారు. పరీక్షలు నిర్వహించి ఆయన అవయవాలు ఎలా పనిచేస్తున్నాయో పరిశీలిస్తున్నామని చెబుతున్నారు. కాగా, ప్రస్తుతం ఆయన్ను లైఫ్ సపోర్ట్ వ్యవస్థపై ఉంచినట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. జైట్లీకి ఈసీఎంఓ(ఎక్స్‌ట్రా కార్పోరియల్‌ మెంబ్రాన్‌ ఆక్సిజనేషన్‌)ను అమర్చినట్లు వెల్లడించారు.

తనంతట తానుగా శ్వాస తీసుకోవడం వీలుకాకపోవడంతో ఈ వ్యవస్థను అమర్చామని చెప్పారు. సాధారణంగా కిడ్నీలు, గుండె పనితీరు మందగించినప్పుడు, శ్వాస తీసుకోలేకపోయినప్పుడు ఈసీఎంఓను ఉపయోగిస్తారు. మరోవైపు కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌, మరో కేంద్రమంత్రి పియూష్ గోయల్, బిహార్ ముఖ్యమంత్రి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అభిషేక్ మను సింఘ్వి ఎయిమ్స్‌కు చేరుకుని జైట్లీ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు.

ఇప్పటికే అరుణ్ జైట్లీని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, హోంమంత్రి అమిత్ షా, బీజేపి అగ్రనేతలు, పలువురు కేంద్రమంత్రులు పరామర్శించారు. వారు వైద్యులతో అరుణ్ జైట్లీ అరోగ్య పరిస్థితిపిై ఆరా తీశారు. కాగా ఎయిమ్స్ వైద్యులు మాత్రం అరుణ్ జైట్లీ అసుపత్రిలో శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ  అగస్టు 9న అసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆయన అరోగ్య పరిస్థితిపై ఎలాంటి హెల్త్ బులిటెన్ విడుదల చేయలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arun jaitley  health condition  AIIMA  nitish kumar  piyush goyal  new delhi  

Other Articles

  • Telugu states to receive heavy rains over the next three days

    తెలుగురాష్ట్రాలకు మూడు రోజుల పాటు వర్ష సూచన

    Sep 18 | తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు కాస్త శాంతించాడని అనుకునే లోపు మళ్లీ విజృంభిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాలల్లోని  అనేక ప్రాంతాల్లో వరుణుడు తన ప్రతాపాన్ని చాటుతున్నాడు. బంగాళాఖాతంలో పశ్చిమమధ్య ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా... Read more

  • Bullock cart owner fined rs 1000 under motor vehicles act in uttarakhand

    కొత్త వాహాన చట్టం ఎఫెక్ట్.. ఎద్దుల బండికి జరిమానా..

    Sep 18 | మోటార్ వాహనాల చట్టానికి సవరణలు చేసి కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం తద్వారా వాహనదారులపై భారీ జరిమానాలు విధిస్తున్నారు పోలీసుల. ఈ క్రమంలో దీనిపై యావత్ దేశవ్యాప్తంగా అనేక విమర్శలు వెల్లివిరయడం.. షోషల్ మీడియా... Read more

  • Are adivasis treated as indian citizens pawan kalyan

    ITEMVIDEOS: అడవి బిడ్డలను భారతీయులుగా గుర్తిస్తున్నామా.?: పవన్ కల్యాణ్

    Sep 17 | అడవి తల్లి బిడ్డలైన చెంచులను మనం భారతీయులుగా గుర్తుస్తున్నామా.? వారికి ఫౌరులందిరికీ వర్తించే హక్కులనుకల్పిస్తున్నామా.? ఒక్కసారి అలోచించాల్సిన అవసరం ఎంతైనా వుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వాలను నిలదీశారు. ఈ మేరకు ఆయన... Read more

  • Kodela siva prasada rao last rites to be conducted tomorrow

    ప్రభుత్వ లాంఛనాలతో రేపు కోడెల అంత్యక్రియలు..

    Sep 17 | ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు బౌతికకాయానికి ప్రభుత్వ లాంఛనాలతో బుధవారం అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధిత శాఖలకు అదేశాలను... Read more

  • Chandrababu demands cbi probe into former ap speaker s alleged suicide case

    ఉన్మాదిలా వెంటపడ్డ ప్రభుత్వం కోడెల ఉసురు తీసింది: చంద్రబాబు

    Sep 17 | మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై స్పందించిన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని అన్నారు. కోడెలపై నమోదైన కేసులపై స్పందిస్తూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు... Read more

Today on Telugu Wishesh