Arun Jaitley health: President Kovind visits AIIMS అరుణ్ జైట్లీ అరోగ్యం మరింత విషమం.. ఎయిమ్స్ కు రాష్ట్రపతి

Arun jaitley critical but stable home minister amit shah visits aiims

Arun Jaitley,Amit Shah,President, Ramnath Kovind, Harsha vardhan, AIIMS, Arun Jaitley critical,Arun Jaitley stable,Arun Jaitley health,Arun Jaitley news,arun jaitley health news, New Delhi

Home Minister Amit Shah and Health Minister Harsh Vardhan visited Arun Jaitley at AIIMS, where the former Union minister is admitted in the Intensive Care Unit since August 9 and is "critical but stable", according to reports.

అరుణ్ జైట్లీ అరోగ్యం మరింత విషమం.. ఎయిమ్స్ కు రాష్ట్రపతి

Posted: 08/16/2019 08:23 PM IST
Arun jaitley critical but stable home minister amit shah visits aiims

కేంద్ర మాజీ ఆర్థికమంత్రి బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. దీంతో కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్వాసకోస వ్యాధులతో అస్వస్థతకు గురైన అరుణ్ జైట్లీ..  గత వారంలో (ఈ నెల 9న) ఎయిమ్స్ అసుపత్రిలో చేరిన ఆయనకు వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. కాగా, ఆయన అరోగ్య పరిస్థితి అకస్మాత్తుగా ఇవాళ మరింత విషమంగా మారింది.

9వ తేదీ నుంచి ఆయన్ను ఐసీయూలో నిరంతరం వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్సను పోందుతున్నారు. కాగా, ఇవాళ ఆయన ఆరోగ్యం మరోమారు విషమించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, బీజేపి జాతీయ అద్యక్షుడు, కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా, బీజేపి నేతలు, కేంద్రమంత్రులు ఎయిమ్స్ కు చేరుకోనున్నారు.

రాష్ట్రపతి కోవింద్ అరుణ్ జైట్లీని పరామర్శించి.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. 66 ఏళ్ల అరుణ్ జైట్లీ  గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అందుకే ఆయన 2019సార్వత్రిక ఎన్నికలకు కూడా దూరంగా ఉన్నారు. మంత్రివర్గంలోకూడా చేరలేదు. గతంలో ఎన్డీయే ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలను నిర్వర్తించారు. గతంలో కేంద్ర ఆర్థిక శాఖమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arun Jaitley  Amit Shah  President  Ramnath Kovind  Harsha vardhan  AIIMS  New Delhi  

Other Articles