"Man made flood drowns Chandrababu's bungalow" ‘‘చంద్రబాబు ఇంటిని ముంచేందుకు.. ప్రభుత్వం కృత్రిమ వరద.!’’

Man made flood drowns chandrababu s bungalow devineni

Amaravati news, Undavalli, Chandrababu Naidu house drone, Devineni Uma, Man made flood, Varla Ramaiah, Chandrababu drone, chandrababu house flood, man made flood, Amaravati, Tdp activists, irrigation department, Police, Andhra Pradesh

Andhra pradesh Former Minister for irrigation Devineni Uma MaheshwarRao alleges even with prior information from karnataka, AP officials had not released water from prakasham barrage, this is a man made floor to make chandrababu bunglow drown.

‘‘చంద్రబాబు ఇంటిని ముంచేందుకు.. ప్రభుత్వం కృత్రిమ వరద.!’’

Posted: 08/16/2019 04:30 PM IST
Man made flood drowns chandrababu s bungalow devineni

టీడీపీ సీనియర్ నేత, ఏపీ సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమ రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. కృష్ణా నదికి ఎగువ నుంచి వచ్చిన వరద నీటితో అమరావతి పరిసతర ప్రాంతాల్లో అనేక గ్రామాలు జలమయమయ్యాయని.. అందుకు కారణం మానవుడు సృష్టించిన వరదే కారణమని అరోపించారు. ప్రభుత్వ కనుసన్నల్లో ఈ కృతిమ వరద సృష్టీకరణ జరిగిందని ఆయన విమర్శించారు.  ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిని ముంచేందుకే ప్రభుత్వం వరదను నియంత్రిస్తోందని ఆయన మండిపడ్డారు.

ఒక ప్రణాళిక లేకుండా కృష్ణా నీటిని విడుదల చేశారని దేవినేని ఉమ ధ్వజమెత్తారు. కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున వరద వస్తోందని తెలిసినా... శ్రీశైలం నిండే వరకు చూశారని ఉమ ఆరోపించారు. శ్రీశైలం దగ్గర కావాలనే నీటిని నిలిపి కావాలనే వరదను అమరావతికి తీసుకొచ్చారని తీవ్ర ఆరోపణలు చేశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ‌నీటిని ముందుగానే విడుదల చేసి ఉంటే పరిస్థితి ఈ రకంగా ఉండేది కాదని వ్యాఖ్యానించారు. రాజధాని భూములు మునిగేలా చేసి... రాజధానిని ఇడుపులపాయకు తీసుకెళ్లాలని సీఎం జగన్ కుట్ర చేస్తున్నారని దేవినేని ఉమ మండిపడ్డారు.

శ్రీశైలం నుంచి సోమశిల వరకు నీరు తీసుకెళ్లి ఉంటే ఆయా ప్రాంతాలకు కూడా నీరు వచ్చేదని అన్నారు. కేవలం చంద్రబాబు ఇల్లు మునిగేందుకు వైసీపీ ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించిందని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని ప్రాంతాలను కూడా ముంచేశారని ఆరోపించారు. వరదపై ముఖ్యమంత్రి, సాగునీటి శాఖ మంత్రి రివ్యూ చేయలేదని... మంగళగిరి ఎమ్మెల్యే వరదపై ఎలా రివ్యూ చేస్తారని దేవినేని ఉమ ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Undavalli  Chandrababu Naidu  Amaravati  Devineni Uma  Man made flood  Varla Ramaiah  Crime  

Other Articles