Two men held for flying drones over Chandrababu's bungalow ఇంటిపైకి డ్రోన్ ప్రయోగం.. భద్రతకే ముప్పుని బాబు ఫైర్.!

Tdp workers nab two men held for flying drones over chandrababu s bungalow

Amaravati news, Undavalli, Chandrababu Naidu house drone, Chandrababu drone, chandrababu house drone, Amaravati, Tdp activists, irrigation department, Police, Andhra Pradesh

Tension prevailed at former AP CM Chandrababu’s residence in Undavalli when TDP workers caught two persons using drones to capture visuals of TDP chief’s bungalow. The police rushed to the spot and detained the suspects.

చంద్రబాబు ఇంటిపైకి డ్రోన్ ప్రయోగం.. భద్రతకే ముప్పుని బాబు ఫైర్.!

Posted: 08/16/2019 12:16 PM IST
Tdp workers nab two men held for flying drones over chandrababu s bungalow

టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం వద్ద ఇవాళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కృష్ణా నదికి వరద ఉద్ధృతి నేపథ్యంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు చంద్రబాబు నివాసంపైకి డ్రోన్ ను ప్రయోగించారు. ఈ విషయాన్ని గుర్తించిన టీడీపీ కార్యకర్తలు వారిని అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న పోలీసులు సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. తాము జలవనరుల శాఖ అధికారులమని సదరు వ్యక్తులు చెబుతున్నారు.

కాగా సదరు వ్యక్తులు చెప్పిన విషయాలను నిజమని నిర్థారించేందుకు వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవు.  దీంతో ఈ విషయం తెలుసుకున్న  టీడీపీ నేత దేవినేని అవినాష్, టీడీ జనార్ధన్ తో పాటు టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడికి వచ్చేశారు. వీరిని పోలీసులు చంద్రబాబు ఇంటి లోనికి అనుమతించలేదు. దీంతో పోలీసులు వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే పోలీస్ జీపు ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు.

నా భద్రతనే ప్రశ్నార్థకంగా మారుస్తారా?: చంద్రబాబు

ఉండవల్లిలోని తన నివాసంపైకి కొందరు డ్రోన్లు ఎగరవేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తో పాటు గుంటూరు జిల్లా సూపరింటెండెంట్(ఎస్పీ)తో ఫోన్ లో మాట్లాడారు. హైసెక్యూరిటీ జోన్ లో డ్రోన్లు ఎలా ఎగరవేస్తున్నారని ప్రశ్నించారు. డ్రోన్లు ప్రయోగించింది ఎవరు? అందుకు అనుమతులు ఎవరు ఇచ్చారు? అని నిలదీశారు.

‘డీజీపీ, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఇలాంటి హై సెక్యూరిటీ ప్రదేశాల్లో డ్రోన్లు ఎగరవేయడానికి వీల్లేదు. అసలు అన్ని అనుమతులతోనే డ్రోన్లను ప్రయోగించారా? నేను ఉండే నివాసంపై డ్రోన్లతో నిఘా పెట్టిందెవరు?. చివరికి నా భద్రతనే ప్రశ్నార్థకంగా మారుస్తారా? ఆ డ్రోన్లను ప్రయోగించిన వ్యక్తులు ఎవరు? ఆ డ్రోన్లలో ఏముందో, పట్టుబడిన వ్యక్తులు ఎవరో ప్రభుత్వం వెంటనే బయటపెట్టాలి. నిఘా వేసింది ఎవరో, దీని వెనుక కుట్ర ఏముందో తెలియజేయాలి’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles