pawan kalyan sensational comments on YSRCP వైసీపీ అధికారంలోకి రావడంపై.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Pawan kalyan sensational comments on ysrcp

Pawan Kalyan, Janasena, west godavari, key leaders meeting, review meeting, pawan kalyan sensational comments, money distribution, elections, YSRCP, CM Jagan, AP Capital Amaravathi, Andhra Pradesh, Politics

Jana Sena party President Pawan Kalyan made sensational comments on YSRCP party comming into power in review meeting with west godavari leaders held at Amaravathi.

వైసీపీ అధికారంలోకి రావడంపై.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Posted: 08/16/2019 09:01 AM IST
Pawan kalyan sensational comments on ysrcp

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంపై జనసేనాని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడింట రెండొంతుల మెజారిటీతో వైసీపీపార్టీ  అధికారంలోకి రావడానికి కారణం ధన ప్రభావమేనని ఆయన అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.  ఎన్నికల్లో డబ్బు పంచడం వైసీపీకే సాధ్యమైందని, ఇదే ఆ పార్టీని అందలం ఎక్కించేలా చేసిందని ాయన అరోపించారు.

ఏడాది నుంచే ఎన్నికల రణక్షేత్రానికి తాము సిద్దమయ్యామని, అప్పుడప్పుడే ఓ వైపు నాయకులు చేరారు.. మరోవైపు ప్రచారానికి కూడా పెద్దగా సమయం లేకపోవడం.. ఊహించని విధంగా అకస్మాత్తుగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం.. అన్ని కలసి తమ పార్టీ పరాజయానికి కారణమయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. అదే మూడేళ్ల నుంచి ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల తరుపు పోరాటం చేసి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఏలూరు లోక్‌సభ స్థానం పరిధిలోని పార్టీ నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వానికి మనపై కక్ష ఎందుకు? అని ప్రశ్నించారు. ఉన్న ఒక్క జనసేన ఎమ్మెల్యేనూ లాక్కునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే రాపాకపై పలు కేసులు పెట్టారన్నారు. వివేకా హత్య కేసు విచారణలో ఎందుకు వేగం లేదు? నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యేపై కేసు ఎందుకు పెట్టలేదు? అని ప్రశ్నించారు. తనను రెచ్చగొట్టొద్దని, అదే జరిగితే ఎంతవరకైనా పోరాడతానని పవన్‌ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Janasena  west godavari  money distribution  elections  Andhra Pradesh  Politics  

Other Articles