President seeks report on inter students suicide ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక కోరిన రాష్ట్రపతి

President seeks report on telangana inter students suicide

President Ram Nath Kovind, Ram Nath Kovind seeks report, Ram Nath Kovind, Ram Nath Kovind president, telangana student suicide, student suicide in telanagana, Intermiediate students suicide, Globarina, interboard failure, Intermiediate students, students suicides, Inter marks goof -up, Intermiediate results, ashok kumar, inter board secretary, Telangana Inter Board, Telangana, politics

President Ram Nath Kovind has sought a report from the Telangana government on the suicide committed by 27 students following the Intermediate examination results.

ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక కోరిన రాష్ట్రపతి

Posted: 08/14/2019 12:51 PM IST
President seeks report on telangana inter students suicide

ఇంటర్ బోర్డు ఏర్పడినప్పటి నుంచి ఎన్నడూ లేని విధంగా ఈ పర్యాయం ఫలితాల వెల్లడిలో విమర్శలను ఎదుర్కోన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సమయం గడిచిన కొద్దీ అటు ఇంటర్ తప్పిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా మర్చిపోయినా.. దానిని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంబోత్సవంతో పాటు ఇత్యాది పనులతో ప్రజలు కూడా మర్చిపోయేలా చేసిన ప్రభుత్వానికి, కాసులు వేటలో కక్కుర్తి తెరతీసీన తెలంగాణ ఇంటర్ బోర్డులు కూడా ఈ విషయాన్ని మర్చిపోయేలా చేశాయి.

అయితే ఎంతో కష్టపడి చదివి తమకు తప్పక నూటికి నూరు శాతం లేదా 99శాతం మార్కులు వస్తాయని భావించారు విద్యార్థులు. తీరా ఫలితాలను చూసి తాము తప్పామని తెలిసి ఏకంగా 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే.. ఇంటర్ బోర్డు చేసిన తప్పిదాలు ఎంతటివో కూడా ప్రజలకు ఇట్టే అర్థమయ్యింది. అయితే తెలంగాణ ఇంటర్ బోర్డు చేసిన తప్పిదాలతో తమ బిడ్డలను కొల్పోయిన తల్లిదండ్రులకు ఆ బిడ్డలు మాత్రం దూరమయ్యారు. ఈ లోటును ఎవరు మాత్రం తీర్చగలరు.. ఏ సంక్షేమ పథకాలు మాత్రం బిడ్లలను కొల్పోయిన బాధను తీర్చగలదు.? అన్న ప్రశ్నలు మాత్రం తెలంగాణలో ఇంకా వినిపిస్తున్నాయి.
 
ఈ క్రమంలో తెలంగాణ అధికారిక టీఆర్ఎస్ పార్టీపై ఇప్పటికే కారాలు మిరియాలు నూరుతూ.. రానున్న ఎన్నికల నాటికి సత్తా చాటాలని భావిస్తున్న బీజేపి మాత్రం మరో అడుగు ముందుకేసింది. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖను ఆదేశించారు. ఇంటర్ ఫలితాల్లో సాంకేతిక, మానవ తప్పిదాల కారణంగా మార్కుల్లో తేడాలు చోటు చేసుకున్నాయని వార్తలు గుప్పుమన్నాయి.

ఈ వ్యవహారంపై బీజేపీ తెలంగాణ చీఫ్ కె.లక్ష్మణ్‌, ఇతర నేతలు గత నెల 1న రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేశారు. 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినా ప్రభుత్వంలో చలనం లేదని, తప్పిదాలకు పాల్పడిన ఇంటర్‌ బోర్డు, గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. బాధిత విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు విద్యార్థులకు సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్రపతికి అందించారు.

బీజేపీ నేతల ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్రపతి ఈ వ్యవహారంపై తనకు పూర్తి నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖను ఆదేశించారు. దీంతో స్పందించిన కేంద్ర హోం శాఖ ఈ నెల 7న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి నివేదిక కోరుతూ లేఖ రాసింది. తమ ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్రపతికి కె.లక్ష్మణ్ ధన్యవాదాలు తెలిపారు. అయితే కేంద్రం నుంచి ప్రశంసలు అందుకుంటే వెంటనే ప్రేస్ మీట్ పెట్టి చెప్పే ప్రభుత్వం.. ఈ విషయాన్ని మాత్రం గత వారం రోజులుగా గోప్యంగానే ఉంచింది. బీజేపి నేతల ధన్యవాదాలతో విషయం వెలుగులోకి వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles