Janasena MLA Rapaka Varaprasad surrenders to police లొంగిపోయిన రాపాక.. కస్టడీని నిరాకరించిన కోర్టు

Janasena mla rapaka varaprasad surrenders to police

Pawan Kalyan, Janasena, east godavari, makilipuram police, tension in Razole, Andhra Pradesh, Politics

Janasena Party MLA Rapaka Varaprasad, has reportedly surrendered to the police amid high drama. A case has been registered on the Janasena leader and his supporters for allegedly destroying property at Malikipuram police station.

లొంగిపోయిన రాపాక.. కస్టడీని నిరాకరించిన కోర్టు

Posted: 08/13/2019 03:56 PM IST
Janasena mla rapaka varaprasad surrenders to police

తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో పోలీస్ స్టేషన్ ముట్టడి కేసులో జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రాజోలు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన విషయం తెలిసిందే. రాపాకకు కస్టడీ విధించే నిమిత్తం రాజోలు మున్సిఫ్ మేజిస్ట్రేట్ ముందు ఆయన్ని పోలీసులు హాజరుపరిచారు. అయితే, రాపాకకు కస్టడీ విధించేందుకు మేజిస్ట్రేట్ నిరాకరించారు. ఓ ఎమ్మెల్యేను అరెస్టు చేసే విధానం ఇది కాదని సూచించారు.

ఇక్కడ చుక్కెదురు కావడంతో రాపాకను స్టేషన్ కు తీసుకొచ్చి, స్టేషన్ బెయిల్ ఇస్తామని పోలీసులు చెబుతున్నట్టు సమాచారం. ఈ కేసులో ఆయన ‘ఏ1’ నిందితుడిగా ఉన్నారు. ఇదిలా ఉండగా, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున రాజోలుకు చేరుకుంటున్నారు. దీంతో, రాజోలు పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ఆయన అనుచరులు దాడిలో ధ్వంసమైన ఈ పోలీస్ స్టేషన్ ను ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ పరిశీలించారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యే రాపాక చర్యలపై ఆయన విమర్శలు చేశారు. ఒక ఎమ్మెల్యే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సమాజానికి మంచిది కాదని సూచించారు. ఇలాంటి తొందరపాటు చర్యల వల్ల యువతను తప్పుదోవ పట్టించినట్టవుతుందని, పోలీస్ వ్యవస్థను ఏమైనా చేయొచ్చనే తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles