cbse hikes exam fees for students by doubling it విద్యార్థుల పరీక్షా ఫీజులను పెంచిన సీబీఎస్ఈ..

Cbse hikes exam fees for sc st students by 24 times

The CBSE has increased the fees of Class 10 and 12 board examinations for SC and ST students from Rs 50 to Rs 1,200, while the amount has been doubled for those from the general category, who will now have to pay Rs 1,500.

The CBSE has increased the fees of Class 10 and 12 board examinations for SC and ST students from Rs 50 to Rs 1,200, while the amount has been doubled for those from the general category, who will now have to pay Rs 1,500.

విద్యార్థులకు వాతలు పెట్టిన సీబీఎస్ఈ.. భారీగా పెరిగిన పరీక్ష ఫీజులు

Posted: 08/12/2019 04:29 PM IST
Cbse hikes exam fees for sc st students by 24 times

కేంద్రీయ మాధ్యమిక విద్యా బోర్డు(సీబీఎస్‌ఈ) విద్యార్థులకు పెద్ద పెద్ద షాకిచ్చింది. విద్యార్థుల పరీక్ష ఫీజులను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక దీంతో పాటు దేశంలోని అణగారిన వర్గాలుగా వున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కర్రు కాల్చి వాతపెట్టింది. ఇన్నాళ్లు నామమాత్రంగా వున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజులను భారీగా పెంచుతూ మోత మోగించింది. ఇక తమ ఫీజుల పెంపు దేశవ్యాప్తంగా సంచలనం కాగా, దీనిని సీబీఎస్ఈ సమర్థించుకోవడం కొసమెరుపు.

ఇప్పటి వరకు సీబీఎస్ఈ 10, 12 తరగతి పరీక్షలకు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అయిదు సబ్జెక్టులకు రూ.50 రుసుము చెల్లిస్తుండగా.. ఆ మొత్తాన్ని ఏకంగా 24 రెట్లు పెంచి రూ.1200 గా నిర్ణయించింది. ఇప్పటి వరకు 12 తరగతిలో ఏదైనా అదనపు సబ్జెక్ట్‌ పరీక్షకు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఎలాంటి ఫీజు ఉండేది కాదు. అయితే ఇకనుంచి ప్రతి అదనపు సబ్జెక్ట్‌కు రూ.300 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

మరోవైపు జనరల్, ఇతర విభాగాలకు చెందిన విద్యార్థుల ఫీజులను కూడా సీబీఎస్‌ఈ రెట్టింపు చేసింది. తాజాగా పెరిగిన ఫీజుల ప్రకారం రూ.750 చెల్లించాల్సిన జనరల్ విద్యార్థులు రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. విదేశాల్లోని సీబీఎస్‌ఈ పాఠశాలల్లో 10, 12 తరగతుల పరీక్షలకు దరఖాస్తుల చేసుకునే విద్యార్థులు ఐదు సబ్జెక్టులకు కలిపి ఇప్పటివరకు రూ.5,000 చెల్లించేవారు.

అయితే ఈ మొత్తాన్ని ఏకంగా రూ.10,000కు పెంచింది. మైగ్రేషన్‌ విద్యార్థుల పరీక్ష ఫీజును కూడా రూ.150 నుంచి రూ.350 కి పెంచింది. 12వ తరగతిలో ప్రతి అదనపు సబ్జెక్టుకు జనరల్ విద్యార్థులు రూ.300 (గతంలో రూ.150), విదేశాల్లోని విద్యార్థులు రూ.2000 (గతంలో రూ.1000) చెల్లించాల్సి ఉంటుంది. పరీక్షా పీజుల వ్యవహారం పెను సంచలనం కాగా, దానిని సీబీఎస్ఈ సమర్థించుకుంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఫీజులు పెంచక తప్పదని కూడా తేల్చిచెప్పింది.

ఫీజుల పెంపు వివరాలు..
విభాగం (కేటగిరీ)    గతంలో ఫీజు     పెరిగిన ఫీజు
ఎస్సీ, ఎస్టీ            రూ.50         రూ. 1,200
జనరల్‌               రూ.750        రూ. 1,500
మైగ్రేషన్‌              రూ.150        రూ.350
విదేశాల్లోని పాఠశాల‌లు     రూ.5,000     రూ.10,000

12వ తరగతిలో ప్రతి అదనపు సబ్జెక్టుకు..
విభాగం            గతంలో ఫీజు          పెరిగిన ఫీజు
ఎస్సీ, ఎస్టీ        ఎలాంటి ఫీజు లేదు     రూ.300
జనరల్‌                  రూ.150         రూ.300
విదేశాల్లోని స్కూళ్లు     రూ.1,000      రూ.2,000

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CBSE  Exam fee hike  10th class  12 class  SC and ST students  General Students  

Other Articles