Animal husbandry condems toxicity in death of 100 cows 100 ఆవుల మృతిలో నిజమేంటో నిగ్గుతేలేనా.?

Ap animal husbandry director condems toxicity in death of 100 cows

100 Cows, cows died, kothuru tadepalli, Goshala, poison, toxicity, Vijayawada, damodhar naidu, Animal husbandry department, Andhra Pradesh, Crime

Initially after the death of 100 cows, the animal husbandry officials suspect toxicitym but now the director of the department condemns the news being spread in the incident that took place at kothuru tadepalli village goshala near vijayawada.

100 ఆవుల మృతిలో నిజమేంటో నిగ్గుతేలేనా.?

Posted: 08/12/2019 11:54 AM IST
Ap animal husbandry director condems toxicity in death of 100 cows

కృష్ణా జిల్లా విజయవాడలో ఏకంగా వంద గోవులు మరణం విషయంలో రాష్ట్ర పశు సంవర్థక శాఖకు చెందిన అధికారుల తీరు ఆగమ్యగోచరంగా వుంది. విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లిలోని గోశాలలో 100 గోపులు మృత్యువాతపడ్డాగా, అందుకు ఫుడ్ పాయిజన్ మాత్రమే కారణమయ్యి వుండవచ్చునని గోశాల నిర్వాహకులు అనుమానించారు, కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం.. నిర్వహించారు.

ఇదిలా వుండగానే రంగంలోకి దిగిన జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు.. ఒక్కసారే 100 ఆవుల మరణం సంభవించడం వెనుక విష ప్రయోగం వుండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే తాజాగా, పశు సంవర్ధక శాఖ అదనపు డైరెక్టర్ డాక్టర్ దామోదర్ నాయుడు ఆధ్వర్యంలోని బృందం విచారణ చేపట్టింది. మేతలో విష ప్రయోగం జరిగిందనడంలో నిజం లేదని, గోవుల మృతికి టాక్సిసిటీ (విషపూరితం) కారణమని ప్రాథమిక విచారణలో వెల్లడైనట్టు ఆయన తెలిపారు.

ఆవుల పోస్టుమార్టం నివేదిక మంగళవారం వస్తుందని దామోదర్ నాయుడు తెలిపారు. గోవులకు పెట్టిన మేతలోనే టాక్సిసిటీ ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. గోశాల నుంచి సేకరించిన నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్టు పేర్కొన్నారు. నివేదికలో పూర్తి వివరాలు వెల్లడవుతాయన్నారు. గోవుల శరీరంలో అనేక చోట్ల రక్తపు చారలు కనబడ్డాయని డాక్టర్ దామోదర్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 100 Cows  cows died  kothuru tadepalli  Goshala  poison  Animal husbandry department  Andhra Pradesh  Crime  

Other Articles