constable arrested for abusing woman రక్షకుడే భక్షకుడైతే: మహిళను వేధించిన కాకీకి అరదండాలు..

Constable held for abusing and manhandling woman

Constable, Woman, harrassment, LIngaswamy, manhandle, Abuse, vansthalipuram, nalgonda, Hyderabad, madannapet PS, Telangana,crime

A constable been arrested for allegedly abusing a woman and manhandling her in the judridiction of vanasthalipuram police station, LIngaswamy had been suspended or his irregularity in duties.

కంచె మేసిన చేను: మహిళను వేధించిన కానిస్టేబుల్ అరెస్టు..

Posted: 08/12/2019 11:00 AM IST
Constable held for abusing and manhandling woman

కంచె చేను మేసిందన్న నానుడి మనకు బాగా తెలిసిందే. తన చేనులోని పంటను ఏ పశువులు తినకూడాదని ఏర్పాటు చేసిన కంచే.. ఏకంగా చేను మేస్తే.. ఏంటీ పరిస్థితి.. అలాగే సమాజంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన ఓ కానిస్టేబుల్ ఓ మహిళను వేధింపులకు గురిచేయడంతో అతన్ని అధికారులు కటకటాల వెనక్కి నెట్టారు. అప్పటికే దారి తప్పిన పోలీసును అధికారులు సస్పెండ్ కూడా చేసినా.. ఆయనకు బుద్దిరాలేదు.. సరికాదా.. మరింత దిగజారి వ్యవహరించాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 7న లింగస్వామి అనే ఈ కానిస్టేబుల్ ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళ అన్న కనికరం కూడా లేకుండా ఆమెను దూషించడంతో పాటు, దాడి కూడా చేయికడా చేసుకున్నాడని బాధితురాలి బందువులు అరోపిస్తున్నారు. అకారణంగా తమ ఇంటి ఆడపడచుపై కానిస్టేబుల్ ఇలా వ్యవహరించడంతో బాధితురాలు తమ బంధువులతో హైదరాబాదులోని వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి పోలీసులు... లింగస్వామిని అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు.

కాగా, నల్గొండ జిల్లా కొమ్మాయిగూడెంకు చెందిన లింగస్వామి (36) మాదన్న పేట పోలిస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. తన విదులు పట్ల కూడా సదరు కానిస్టేబుల్ కు పెద్దగా అసక్తి లేదు. దీంతో గత ఏడాది కాలంలో డ్యూటీకి సరిగా హాజరుకాలేదు. ఈ కారణంగా ఉన్నతాధికారులు అతనిపై చర్యలు తీసుకుంటూ అతడ్ని విదుల నుంచి సస్పెండ్ కూడా చేశారు. ఈ సందర్భంగా సీఐ వెంకటయ్య మాట్లాడుతూ, కేసును దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Constable  harrassment  LIngaswamy  vansthalipuram  nalgonda  madannapet PS  Telangana  crime  

Other Articles