Pakistan expels Indian envoy, suspends all bilateral trade భారత్ తో వాణిజ్యం వదులుకున్నపాకిస్థాన్.. ఎవరికి నష్టం.?

After govt s kashmir move pakistan downgrades diplomatic ties

Vijay K. Nambiar,united nations,Shah Mehmood Qureshi,Pulwama,Jammu and kashmir,international law,India Pakistan trade,Government of Pakistan,Article 370, Imran Khan, Narendra Modi, Donald Trump, India, Pakistan, Trade, bilateral ties, foreign affairs, politics

Pakistan expelled India’s high commissioner Ajay Bisaria on Wednesday to protest against the decision which strips Jammu & Kashmir of its special status and splits the state into two Union territories.

భారత్ తో వాణిజ్యం వదులుకున్నపాకిస్థాన్.. ఎవరికి నష్టం.?

Posted: 08/08/2019 11:15 AM IST
After govt s kashmir move pakistan downgrades diplomatic ties

జమ్ము-కశ్మీర్‌ ప్రత్యేక హోదాను తొలగిస్తూ. ఆ రాష్ట్రానికి ఏడు దశాబ్దాల పాటు వున్న విశేష హక్కులను కూడా తుంగలో తొక్కుతూ.. అదిక భాగం దేశప్రజలు కోరుకున్న విధంగా భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై పాకిస్థాన్‌ కూడా తీవ్రంగా స్పందించింది. అయితే కొరివితో తల గోక్కున్న చందంగా ఆ దేశ చర్యలు వున్నాయి. జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని చట్టవిరుద్ధంగా, ఏకపక్షంగా రద్దు చేసిందని విమర్శించిన పాకిస్తాన్.. ప్రతిచర్యగా భారత్ తో దౌత్య సంబంధాలను ‘కనిష్ఠ స్థాయి’కి తగ్గించింది.

అంతేకాదు ఇరు దేశాల మధ్య సాగుతున్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని కూడా రద్దు చేసింది. ఇస్లామాబాద్ లోని భారత హై కమిషనర్‌ అజయ్‌ బిసారియాను బహిష్కరించింది. ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించాల్సి ఉన్న తమ రాయబారి మొయిన్‌ ఉల్‌ హక్ ను అక్కడికి పంపరాదని నిర్ణయించింది. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అధ్యక్షతన జరిగిన జాతీయ భద్రతా కమిటీ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అత్యున్నతస్థాయి పౌర, మిలిటరీ అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. దేశ భద్రతకు సంబంధించి ఈ సంఘమే చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకుంటుంది.

కాగా, పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయాలతో అ దేశానికే ఎక్కువ అన్యాయం జరుగుతుందని, మన దేశానికి పెద్దగా వచ్చే నష్టమేమీ లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటన వెలువరించింది. అయితే అగస్టు 15న పాకిస్తాన్ బ్లాక్ డే నిర్వహించాలని తలపెట్టిన నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ సహా దేశవ్యాప్తంగా పలు సున్నిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తామని తెలిపింది. మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని పాకిస్తాన్ ప్రచారం చేయాలని భావిస్తున్నా.. వారి బంగారు భవిష్యత్తును మాత్రం కోరుకోవడం లేదని, అక్కడ నిత్యం అనిశ్చితి నెలకొనేలా పాక్ చర్యలున్నాయని విదేశాంగ వర్గాలు చెప్పారు.

పాకిస్థాన్‌ తీసుకున్న నిర్ణయం భారత్‌పై ప్రభావం చూపదని విదేశీ వ్యవహారాల మాజీ మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు సల్మాన్‌ ఖుర్షీద్‌ వ్యాఖ్యానించారు. దిల్లీలోని ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ద్వైపాక్షిక సంబంధాలు పెంచుకోవాల్సిన తరుణంలో పాక్‌ చాలా హ్రస్వ దృష్టితో ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. పాకిస్థాన్‌లో భారత మాజీ హైకమిషర్‌ టీసీఏ రాఘవన్‌ మాట్లాడుతూ రెండు దేశాల మధ్య జరిగే వాణిజ్యం చాలా తక్కువని, అందువల్ల పాక్‌ నిర్ణయంతో నష్టం లేదని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Article 370  Imran Khan  Narendra Modi  India  Pakistan  Trade  bilateral ties  foreign affairs  politics  

Other Articles