Article 370 harmed J&K alleges Amit Shah ఆర్టీకల్ 370తో జమ్మూకాశ్మీర్ కు నష్టం: అమిత్ షా

People of j k want democracy says amit shah in upper house

article 35A, Article 370, Nazir Ahmad Laway, MM Fayaz, PDP, Congress, JK, Ladakh, indian armed forces, Jammu and Kashmir, Kashmiri terrorists, mehbooba mufti, Modi Government 2.0, omar abdullah, Operation Kashmir, Pak sponsored terrorism, PM Narendra Modi

Union home minister Amit Shah said in Rajya Sabha, “Because of Article 370, democracy has never percolated, corruption was at its peak and poverty was entrenched in the area. The people of J&K want democracy and if you see clearly you will know how much Article 370 has harmed J&K."

జమ్మూకాశ్మీర్ వాసులు ప్రజాస్వామ్యాన్ని కొరుకుంటున్నారు: అమిత్ షా

Posted: 08/05/2019 07:21 PM IST
People of j k want democracy says amit shah in upper house

రాజ్యసభలో ఆర్టికల్ 370పై నిరసనల హోరు మధ్య చర్చ జరుగుతున్న వేళ, జమ్మూకాశ్మీర్ ప్రాంత పునర్విభజనకు నడుం చుట్టిన కేంద్రం నాలుగు బిల్లులను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రసంగిస్తూ.. తమ నిర్ణయంతో అక్కడి ప్రజలు రానున్న నాలుగున్నరేళ్లలో అభివృధ్దిని అందిపుచ్చుకుంటారని, అలాంటి చర్యలకు కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం శ్రీకారం చుటుతుందని అన్నారు.

దీర్ఘకాలం రక్తపాతానికి కారణమైన ఆర్టికల్ 370 పరిసమాప్తమైందన్నారు. జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని గుర్తుచేసుకోవాల్సిన క్షణాలివని అన్నారు. ఈ ఆర్టికల్ కారణంగా ఎలాంటి పరిణామాలు వస్తాయో ఆనాడే చెప్పారని గుర్తుచేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన కష్టనష్టాలపై చాలామంది ఏకరవు పెట్టారని, దీన్ని రద్దు చేస్తే ప్రపంచం మునుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారని విమర్శించారు. ఈ బిల్లు రద్దుపై కొంత మంది నిజాలు దాచిపెట్టారని మండిపడ్డారు.

ఆర్టికల్ 370 కారణంగా.. పెద్ద పర్యాటక సంస్థలు పెట్టుబడులు పెట్టడం లేదని, పాక్ నుంచి భారత్ వచ్చిన శరణార్థులకు దేశ వ్యాప్తంగా ఓటు హక్కు వచ్చింది కానీ, ఆ శరణార్థులకు జమ్ముకశ్మీర్ లో మాత్రం ఓటు హక్కు రాలేదని అమిత్ షా అన్నారు. ప్రజల బాగోగుల కోసమే పార్లమెంట్ చట్టాలు చేస్తోందని, ఆ చట్టాలు జమ్ముకశ్మీర్ ప్రజలకు చేరడం లేదని,  ఆర్టికల్ 370 రద్దుతోనే అవన్నీ సాధ్యమవుతాయని చెప్పారు.

ఆర్టికల్ 370 పేరుతో ఇప్పటి వరకూ అడ్డుగోడలు కట్టారని, ఇప్పటికైనా వాటిని తొలగిద్దామని అన్నారు. ఈ ప్రాంత యువతులు ఇతర ప్రాంతాల వారిని పెళ్లి చేసుకుంటే వారు ఆస్తి హక్కు కోల్పోతున్నారని, అక్కడి మహిళలకు సాధికారత రావాలంటే ఈ ఆర్టికల్ రద్దు కావాలని అన్నారు. జమ్ముకశ్మీర్ లో ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు కావడం లేదని చెప్పారు. ఈ బిల్లులో న్యాయపరంగా ఎలాంటి లోపాలు లేవని, ఈ బిల్లు పూర్తిగా న్యాయ సమీక్షకు నిలబడుతుందని స్పష్టం చేశారు.

కశ్మీర్ యువతలో విద్వేష బీజాలు నాటి పెంచారని, పాకిస్థాన్ కుట్ర పూరితంగా సాగించిన చర్యలకు ఇక్కడి యువత బలయ్యారని అమిత్ షా అన్నారు. ‘ఉగ్రవాదం’ అనే విషవృక్షాన్ని పెకిలించేందుకే కశ్మీర్ లో ఈ పరివర్తన ప్రయత్నాలు చేస్తున్నామని, ఆర్టికల్ 370 రద్దుతో అవన్నీ సాధ్యమవుతాయని చెప్పారు. ఈ ఆర్టికల్ ఉన్నంత వరకూ కశ్మీర్ యువత భారత్ లో కలవదని పాక్ నేత జియావుల్ హక్ ఆనాడే చెప్పారని గుర్తుచేశారు.

పాక్ ప్రేరేపిత వేర్పాటువాదుల వల్లే ఈ సమస్య తలెత్తిందని విమర్శించారు. ఆర్టికల్ 370 కోసం పట్టుబట్టే వారి పిల్లలు ఎక్కడున్నారో గుర్తుచేసుకోవాలని సూచించారు. వేర్పాటువాదుల పిల్లలంతా అమెరికా, ఇంగ్లాండు లలో చదువుకుంటున్నారని విమర్శించారు. జమ్ముకశ్మీర్ యువతకు మంచి భవిష్యత్తు అందించాలని అనుకుంటున్నామని, కశ్మీర్ లో ఉగ్రవాదం పోవాలంటే ఈ ఆర్టికల్ రద్దు తప్పదని స్పష్టం చేశారు.

డెబ్బై ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎవరూ ఈ ఆర్టికల్ ను కదిపే సాహసం చేయలేదని, ఒక తాత్కాలిక ఆర్టికల్ ను ఇలా ఎన్నాళ్లు కొనసాగిస్తారని ప్రశ్నించారు. నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ విలీనం చేసిన సంస్థానాలన్నీ ఈరోజు భారత్ లో అంతర్భాగంగా ఉన్నాయని, ఆ సంస్థానాల్లో ఎక్కడా ఆర్టికల్ 370 అమల్లో లేదని అన్నారు. ఆర్టికల్ 370 వల్లే జమ్ముకశ్మీర్ విలీనం జరిగిందన్న వాదన తప్పని, ఆ ఆర్టికల్ లేకుంటే భారత్ నుంచి జమ్ముకశ్మీర్ విడిపోతుందని అంటున్నారని, అవన్నీ భ్రమలేనని, అందులో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : article 35A  Article 370  Nazir Ahmad Laway  MM Fayaz  PDP  Congress  JK  Ladakh  politics  

Other Articles