Vishweshwar Hegde Kageri elected as Karnataka Speaker కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ గా విశ్వేశ్వర్ హెగ్డే ఏకగ్రీవ ఎన్నిక

Bjp mla vishweshwar hegde kageri elected as karnataka speaker

karnataka assembly speaker, Vishweshwar Hegde Kageri, Deputy Speaker, Krishna Reddy, KR Ramesh Kumar, karnataka, Politics

After Former Karnataka Assembly Speaker KR Ramesh Kumar had resigned from his post soon after BS Yediyurappa government won floor test in the house, BJP's Kageri has been elected as the Speaker, with no opposition.

కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ గా విశ్వేశ్వర్ హెగ్డే ఏకగ్రీవ ఎన్నిక

Posted: 07/31/2019 04:08 PM IST
Bjp mla vishweshwar hegde kageri elected as karnataka speaker

కర్నాటక అసెంబ్లీ స్పీకర్ గా బీజేపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ హెగ్డే కగేరి ఎన్నికయ్యారు. మంగళవారం(జులై-30,2019)ఉదయం సీఎం యడ్యూరప్పతో కలిసి వెళ్లి స్పీకర్ పదవికి హెగ్డే నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. హెగ్డేకు పోటీగా ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో ఆయన స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఇవాళ(జులై-31,2019)అధికారులు ప్రకటించారు.

కుమార స్వామి ప్రభుత్వం కుప్పకూలిపోవడంతో గత వారం రాష్ట్ర ముఖ్యమంత్రిగా యడియూరప్ప బాధ్యతలు స్పీకరించిన విషయం తెలిసిందే. సోమవారం(జులై-29,2019) విశ్వాస పరీక్షలో యడియూరప్ప నెగ్గిన అనంతరం స్పీకర్ పదవికి కేఆర్ రమేశ్ కుమార్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో కొత్త స్పీకర్‌ గా  బీజేపీ పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న విశ్వేశ్వర్ హెగ్గే వైపు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది.

విశ్వేశ్వర్ హెగ్డే... బీజేపి విద్యార్థి విభాగం ఏబివీపీలో నాయకుడిగా పొలిటికల్ కెరీర్‌ను ప్రారంభించారు. 1994లో అంకోల నియోజకవర్గం నుంచి గెలుపొందారు. మూడు సార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. నియోజకవర్గల పునర్ విభజనతో విశ్వేశ్వర్..సిర్సా నియోజకవర్గానికి మారిపోయారు. ఇక్కడ కూడా ప్రజలు ఆయన్ని ఆదరించారు. 2008, 2013, 2018లో వరుసగా ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందుతూ వస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : assembly speaker  Vishweshwar Hegde Kageri  Krishna Reddy  KR Ramesh Kumar  karnataka  Politics  

Other Articles