Crucial Congress meet ahead of Yediyurappa's trust vote యడ్యూరప్పకు అధికారం అందేనా.? బీజేపి సేఫ్ గేమ్

Karnataka trust vote live bs yediyurappa to face floor test shortly

Karnataka, Yediyurappa, Karnataka government, Speaker Ramesh Kumar, siddaramaiah, congress, BJP, disqualified MLAs, CM Yediyurappa, Politics

Ravi Kumar, BJP's state unit secretary, said that apart from their 105 MLAs, they also have the support of one or two independent MLAs. He added that the party is confident of proving majority on the floor of Assembly.

యడ్యూరప్పకు అధికారం అందేనా.? బీజేపి సేఫ్ గేమ్

Posted: 07/29/2019 10:03 AM IST
Karnataka trust vote live bs yediyurappa to face floor test shortly

కర్ణాటక అసెంబ్లీలో మరోసారి బలనిరూపణ నిర్వహించనున్నారు. నాలుగో పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీనియర్ బీజేపి నేత యడియూరప్ప శాసనసభలో మరోమారు తన బలం నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే బీజేపికి 105 మంది ఎమ్మెల్యేల మద్దతు వుండటం.. సభలో ప్రస్తుతం వున్న గణంకాల నేపథ్యంలో కేవలం 104 మంది బలం వుంటే విశ్వాస పరీక్షను నెగ్గే అవకాశాలున్నాయి.

దీంతో  సీఎం యడియూరప్ప విశ్వాస పరీక్షలో విజయం సాధిస్తామని ధీమాను వ్యక్తం చేశారు. 100 శాతం మెజారిటీతో విజయాన్ని అందుకుంటామని చెప్పారు. కాగా, విశ్వాస పరీక్ష అనంతరం సభలో ఆర్థిక బిల్లును ఆమోదింపచేసుకోవాల్సి ఉందని, ఆ బిల్లుకు ఆమోదం రాకపోతే ఉద్యోగుల జీతాలకు నిధులు వినిగించుకోలేని పరిస్థితి ఉంటుందని తెలిపారు. ఈ బిల్లును కాంగ్రెస్-జేడీఎస్ సర్కారు రూపొందించింది. అయితే, ఈ బిల్లులో ఎలాంటి మార్పులు లేకుండానే సభలో ప్రవేశపెడతామని యడియూరప్ప వెల్లడించారు.  

కర్ఱాటక అసెంబ్లీలో గోడ మీద పిల్లలా వ్యవహరించి రెబల్ గా మారిన 14 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేశ్ కుమార్ అనర్హత వేటు వేశారు. ఇదివరకే ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు వేసిన ఆయన.. క్రితం రోజున మరో 14 మందిపై వేటు వేయడంతో పాటు రానున్న నాలుగేళ్ల కాలంలో వారు ఎన్నికలలో పోటీచేయడానికి కూడా వీలులేకుండా చేశారు. దీంతో కన్నడ అసెంబ్లీ నుంచి మొత్తం 17 మందిని డిస్ క్వాలిఫై చేసినట్టు అయింది.

ఎమ్మెల్యేల డిస్ క్వాలిఫికేషన్ ను స్వయంగా మీడియా ముందు ప్రకటించిన రమేశ్ కుమార్, స్పీకర్ గా తాను రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు. కాగా, స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు చేసిన ప్రజా ప్రతినిధుల రాజీనామాలను ఆమోదించకుండా, వారు తప్పు చేసినట్టు డిస్ క్వాలిఫై చేయడం ఏంటని పలువురు బీజేపీ నేతలు తప్పుబడుతుతున్నారు. కాగా, డిస్ క్వాలిఫై అయిన వారిలో కాంగ్రెస్ నుంచి బస్వరాజు, మునిరత్నం, సోమశేఖర్, సుధాకర్, శివరాం హెబ్బర్, శ్రీమంత పాటిల్, జేడీఎస్ నుంచి గోపాలయ్య, నారాయణ గౌడ, విశ్వనాథ్ తదితరులున్నారు.

కాగా స్పీకర్ నిర్ణయాన్ని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్వాగతించారు. స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా వుందన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై జేడీఎస్ నేత విశ్వనాథ్ మాట్లాడుతూ, తమపై అనర్హత వేటు వేయడం సరికాదని అన్నారు. సభాపతి విధించిన అనర్హత వేటు చట్టవిరుద్ధమని, న్యాయం కోసం తామంతా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని, రేపు పిటిషన్ వేస్తామని చెప్పారు. మొత్తానికి పద్నాల్గుగు నెలల తరువాత మరోమారు అధికార పగ్గాలను అందుకోనున్న యడ్యూరప్పకు ఈ సారైనా నాలుగేళ్ల పాటు అధికారం వుంటుందా.? అన్నది వేచిచూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yediyurappa  siddaramaiah  congress  BJP  disqualified MLAs  Karnataka  Politics  

Other Articles