assembly seats increase bill to be tabled in parliament ఫార్లమెంటుకు త్వరలో తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపు బిల్లు.!

Telugu states assembly seats increase bill to be tabled in parliament

Jammu And Kashmir, Andhra Pradesh, Telangana, Election Commission, Central Government, Sikkim, Parliament, Politics

The Union government finally to honour telugu states bifurfication bill and increase tha assembly seats of telugu states along with sikkim and jammu and kashmir.

ఫార్లమెంటుకు త్వరలో తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపు బిల్లు.!

Posted: 07/27/2019 11:12 AM IST
Telugu states assembly seats increase bill to be tabled in parliament

తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలు, నేతలు, గత ఐదారేళ్లుగా ఎదురుచూస్తున్న తరుణం త్వరలో రాబోతొంది. అదేంటి ఇటీవలే రెండు తెలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యియి కాదా.? ఇంకా దేనికోసం పార్టీలు నేతల ఎదురుచూపులు అంటారా.? ఇక్కడే అసలు ట్విస్టు వుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు జమ్మూకశ్మీర్, సిక్కిం రాష్ట్ర ప్రజలు కూడా ఒకింత సంబరపడుతున్నారు. ఎందుకంటారా.?

తెలుగు రాష్ట్రాలకు పునర్విభజన బిల్లులో పేర్కోన్న అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధించిన ఫైలు దుమ్ముదులిపేందుకు కేంద్రం సిద్దమైనట్లు సమాచారం. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలతో పాటు సిక్కిం, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపుకు సంబంధించి కూడా రంగం సిద్ధమైనట్టు సమాచారం. ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా వివరణ కోరగా.. ఈసీ ఆ వివరాలను వెల్లడించింది. అసెంబ్లీ సీట్ల పెంపుపై ఏప్రిల్‌లోనే ఈసీకి కేంద్ర ప్రభుత్వం నోట్‌ పంపింది.

అయితే కేంద్రం పంపిన నోట్‌ సరిగా లేదంటూ.. సరైన సమాచారంతో మరోసారి పంపాలని హోంశాఖను ఈసీ కోరింది.అసెంబ్లీ సీట్ల పెంపుపై ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ, హోంశాఖలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, తాజాగా పునర్విభజనకు సంబంధించి ఈ నాలుగు రాష్ట్రాల్లో ఒక కమిషన్‌ను కేంద్రం ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ కమిషన్ నివేదిక ఆధారంగా సీట్ల సంఖ్య ఏపీలో 225, తెలంగాణలో 151కి చేరుకోనుంది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jammu And Kashmir  Andhra Pradesh  Telangana  EC  Central Government  Sikkim  Parliament  Politics  

Other Articles