Asaduddin takes oath amid bharat mata ki jai slogans పార్లమెంటులో జై భీమ్, జైహింద్ అంటూ అసద్ నినాదాలు

Aimim mp asaduddin owaisi raises jai bheem jai hind slogans in parliament

Asaduddin Owaisi, Oath Taking Ceremony, MIM MP, Asaduddin Owaisi Speech, BJP MPs Slogans, Lok Sabha Sessions, MPs Oath Taking Ceremony, Parliament Sessions, Slogans In Lok Sabha, Slogans In Parliament, Bharat Matha Ki Jai Slogans, BJP MPs Slogans, Parliament, Lok Sabha, Politics

Amid Bharat mata ki Jai slogans from BJP and its ally parties AIMIM party MP Asaduddin Owaisi Takes Oath As Member of Parliament

ITEMVIDEOS: పార్లమెంటులో జై భీమ్, జైహింద్ అంటూ అసద్ నినాదాలు

Posted: 06/18/2019 03:00 PM IST
Aimim mp asaduddin owaisi raises jai bheem jai hind slogans in parliament

భారత పార్లమెంటులో లోక్ సభ సభ్యుల ప్రమాణ స్వీకారం ఇవాళ కూడా కొనసాగింది. ఈ సంధర్భంగా పలువురు పార్లమెంటు సభ్యులు లోక్ సభలో ప్రమాణ స్వీకారం చేస్తుండగా.. "భారత్ మాతాకి జై" అంటూ "జై హింద్" అంటూ స్వతహాగా నినాదాలు చేశారు. కొత్తగా ఎంపికైన ఎంపీలు కూడా తమ దేశభక్తిని ఇలా చాటుకున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ఎంపీలు ఇవాళ లోక్ సభలో సభ్యులుగా ప్రమాణం చేశారు. ఇదే సమయంలో మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణం చేస్తున్న సమయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

అసదుద్దీన్ ప్రమాణం చేయడానికి లోక్‌సభ అధికారులు పిలవగా.. బీజేపీ సభ్యులతో పాటు వాటి మిత్రపక్షాల సభ్యులు కూడా భారత్ మాతాకీ జై నినాదాలు చేశారు. అధికారుల పిలుపుతో పోడియం వద్దకు చేరుకునే క్రమంలో ఆ నినాదాలను విన్న అసద్.. తన చేతులతో సైగలు చేస్తూ ఇంకా పెద్దగా చేయండి.. అలాగే నినాదాలు చేయండి.. అంటూ నవ్వుతూ… చేతులు ఊపుతూ స్పీకర్ పోడియం ముందుకు వెళ్లారు. అక్కడికి చేరుకున్న తరువాత కూడా బీజేపి ఎంపీల నినాదాలు ఆగకపోవడంతో.. కొంచెం వాళ్లను ఆపండి ప్రమాణం చేస్తాను అని అధికారులకు వెల్లడించారు.

ఇక ఆతర్వాత ఉర్దూలో ప్రమాణం చేసిన అసదుద్దీన్.. చివర్లో జై భీమ్..అల్లాహో అక్బర్.. జై హింద్ అంటూ నినదించి ముగించారు. ఇంతకీ ఆలా ఎంపీలు ఎందుకు నినదించారంటే.. గతంలో ఆర్‌ఎస్‌ఎస్ మోహన్ భగవత్ గారు.. మాట్లాడుతూ దేశంలో పుట్టిన ప్రతీ ఒక్కరూ భారత్ మాతాకి జై అంటూ నినదించాలని చెప్పిన సంధర్భంలో ‘నేను భారత్‌ మాతాకీ జై అన్న నినాదాన్ని చేయను. ఏం చేస్తారు భగవత్‌గారూ!’ అంటూ అసదుద్దీన్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే‌. ‘తన పీక మీద కత్తి పెట్టినా కూడా ఇలాంటి నినాదాలను చేయననీ, అలా నినదించాలని మన రాజ్యాంగంలో ఎక్కడా లేదని’ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో లోక్‌సభలో చోటుచేసుకున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Asaduddin Owaisi  Oath Taking Ceremony  MIM MP  BJP MPs Slogans  Parliament  Lok Sabha  Politics  

Other Articles