YS Jagan invited to Kaleshwaram Inauguration కాళేశ్వరం ప్రారంభానికి ఏపీ సీఎంను ఆహ్వానించిన కేసీఆర్

Kcr invities jagan for inauguration of kaleswaram project

Andhra Pradesh, Government of India, YSR Congress Party, Y. S. Jaganmohan Reddy, K. Chandrashekar Rao, Telangana, Kaleshwaram, Siddipet, Telugu people, T. Harish Rao, Samaikyandhra Movement, KCR, jagan, Vijayawada, Kaleshwaram Lift Irrigation Project, Kanaka Durga temple, Politics

Telangana CM KCR invites Andhra Pradesh counter part Chief Minister YS Jagan Mohan Reddy to the inauguaration of kaleshwaram project on June 21.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి ఏపీ సీఎంను ఆహ్వానించిన కేసీఆర్

Posted: 06/17/2019 04:23 PM IST
Kcr invities jagan for inauguration of kaleswaram project

తెలంగాణ ప్రజల దాహార్తితో పాటు లక్షల ఎకరాలకు సాగునీరును కూడా అందించే భృహత్తర కాళేశ్వరం ప్రాజెక్టు వెట్ రన్ తో విజయపరవళ్లు తొక్కుకుంటూ ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఇక త్వరలోనే ఆ ప్రాజెక్టును జాతికి అంకితం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతూ అందుకు ముహూర్తాన్ని కూడా నిర్ణయించుకుంది. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆహ్వానించారు.

తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి వెళ్లిన కేసీఆర్‌, కేటీఆర్‌ బృందాన్ని జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. పుష్పగుచ్చాలను అందించి తన నివాసంలోకి అహ్వానించారు. అనంతరం కేసీఆర్‌ బృందానికి మధ్యాహ్న భోజన విందును ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ సహా తెలంగాణ నుంచి వెళ్లిన బృందం సభ్యులకు అతిధ్యాన్ని అందించారు వైఎస్ జగన్. అనంతరం జరిగిన భేటీలో.. ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా పరిష్కారానికి నోచుకోని సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చర్చలు జరిపారు.

ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా వున్న సమస్యలతో పాటు విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలో ప్రభుత్వ రంగ సంస్థల విభజనపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించిన్నట్లు సమాచారం. వీటితో పాటుగా విద్యుత్‌ ఉద్యోగుల విభజన, విద్యుత్‌ బకాయిల అంశాలపై చర్చలు జరిపారని తెలుస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి వివాదాల పరిష్కారంపైనా సీఎంలు సమాలోచనలు చేశారు. విభజన చట్టంలో ఉన్న పెండింగ్‌ అంశాలన్నింటిపైనా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుమారు గంటకు పైగా చర్చలు జరిపారు.

కేసీఆర్ కు ఘన స్వాగతం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి తదితరులు ఘనస్వాగతం పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిని ఆహ్వానించడంతో పాటు విశాఖ శ్రీశారదాపీఠ ఉత్తరాధికారి శిష్య తురియాశ్రమ స్వీకార మహోత్సవంలో కేసీఆర్‌ పాల్గొన్ననున్నారు.  రాత్రి ఏడు గంటల 40 నిమిషాలకు తిరిగి హైదరాబాద్ కు బయలుదేరుతారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  jagan  Vijayawada  Kaleshwaram Lift Irrigation Project  Kanaka Durga temple  

Other Articles