JC Diwakar Reddy Announces Political Retirement జేసి దివాకర్ రెడ్డి సంచలన నిర్ణయం.. పర్మినెంట్ రిటైర్మెంట్..!

Jc diwakar reddy announces retirement from politics

JC diwakar Reddy, YS Jagan, Chief Minister, PM Modi, Narendra Modi, former MP, Anantapur, Andhra Pradesh, Politics

TDP Senior Leader and former Anantapur MP JC Diwakar Reddy announced retiring from politics. He feels politics changed over the last 40 years and it is difficult for him to adjust in present-day politics.

జేసి దివాకర్ రెడ్డి సంచలన నిర్ణయం.. పర్మినెంట్ రిటైర్మెంట్..!

Posted: 06/03/2019 07:21 PM IST
Jc diwakar reddy announces retirement from politics

సీనియర్‌ టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రియాశీలక రాజకీయాల నుంచి ఆయన శాశ్వతంగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఇకపై రాజకీయాలు చేయబోనని, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నానని ప్రకటించారు. కొద్ది రోజులుగా తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలు నిరాధారం అని ఖండించారు. తాను ఏ పార్టీలోనూ చేరడం లేని జేసీ స్పష్టం చేశారు. ఈ క్రమంలో తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పారు.

సోమవారం అనంతపురంలోని ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు 40 ఏళ్లుగా సహకరించిన పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. తన తండ్రి సంజీవ్‌రెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని.. కానీ ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తప్పుకోవాలని భావిస్తున్నట్లు జేసీ వెల్లడించారు. ప్రధాని మోదీతో సీఎం జగన్‌ సఖ్యతగా వ్యవహరిస్తున్న తీరు శుభపరిణామమని జేసీ వ్యాఖ్యానించారు. పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని జేసీ కితాబిచ్చారు.

‘‘జగన్‌పై రాజకీయ విమర్శలు చేశా తప్ప ఎప్పుడూ ద్వేషించలేదు. జగన్‌ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. అలాగని నేను పార్టీ మారాలనుకోవడం లేదు’’ అని ఆయన స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంతి రాజశేఖర్‌ రెడ్డితో ఉన్న అనుంబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. తమ ఇద్దరి మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. సుహృద్భావం ఉండేదని చెప్పారు. రాజకీయాలపై ప్రస్తుతం తనకు ఆసక్తి లేదన్నారు. అయితే ఎన్నికల సంఘంలో మార్పులు చేయాల్సిన అవసరముందని జేసీ అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : JC diwakar Reddy  YS Jagan  Chief Minister  PM Modi  Narendra Modi  former MP  Anantapur  Andhra Pradesh  Politics  

Other Articles

 • Pakistan prime minister imran khan shows up when searching for bhikari

  పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. బికారియేనా.?

  Aug 19 | జమ్మూకాశ్మీర్ లో ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించి ఆ ప్రాంతవాసులకు కూడా యావత్ భారత దేశ ప్రజలు అనుభివిస్తున్న స్వేచ్ఛా వాయువును అందించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో పాటు పారిశ్రామీకరణకు దూరంగా వున్న ఈ ప్రాంతాన్ని... Read more

 • Minor girl in mumbai married off forced into flesh trade by mother raped by brother

  కుటుంబ పోషణ కోసం పైళ్లైన కూతురితో వ్యభిచారం

  Aug 19 | ఎలాంటి అలమరికలు లేకుండా ఉరుకులు. పరుగులు తీయాల్సిన వయస్సులో అమె పాలిట కన్నతల్లే కసాయిగా మారింది. తన బిడ్డ జోలికి ఎవరైనా వస్తే వారిని నిలువరించే తల్లులు వున్న ఈ సమాజంలో.. ఇలాంటి తల్లి... Read more

 • Ips officer booked for kicking pregnant lady who suffered miscarriage

  కోర్టు అదేశాలతో.. గర్భిణిని తన్నిన మహిళా ఎస్పీపై క్రిమినల్ కేసు..

  Aug 19 | పోలీసులకు నిందితులను అదుపులోకి తీసుకుని వారిని న్యాయస్థానంలో హాజరుపర్చాల్సిన బాధ్యత వున్నా.. దానిని అధిగమించి వారు పరారీలో వున్న నిందితుల అచూకీ కనుక్కునే సమయంలో నిందితుల సంబంధికులపై చేయి చేసుకోవడం, వారిని అకారణంగా ఠాణాలకు... Read more

 • 8 die as mini goods carrier plunges into well in tiruchi

  ఆటో టైరు పేలడంతో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి

  Aug 19 | తమిళనాడులో ఘోర రోడ్డప్రమాదం సంభవించింది. గూడ్స్ కారియర్ అటోలో ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తున్న ఆటో టైరు పేలడంతో ఈ దుర్ఘటన సంభవించింది. వేగంగా వెళ్తున్న ఆటో టైరు పేలడంతో అదుపుతప్పి రోడ్డు పక్కనున్న బ్యారికేడ్... Read more

 • Arun jaitley continues to be critical on life support

  అరుణ్ జైట్లీ ఆరోగ్యం మరింత విషమం.. ఎయిమ్స్ కు బీజేపి నేతలు

  Aug 18 | కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత అరుణ్ జైట్లీ ఆరోగ్యం మరింత విషమించింది. ఆయన కిడ్నీలు, ఊపిరితిత్తులు కూడా సక్రమంగా పనిచేయడం లేదని వైద్యులు అంటున్నారు. పరీక్షలు నిర్వహించి ఆయన అవయవాలు ఎలా పనిచేస్తున్నాయో... Read more

Today on Telugu Wishesh