Arrest Imminent for TV9 Raviprakash సుప్రీంకోర్టులో రవిప్రకాష్ కు చుక్కెదురు.. మళ్లీ హైకోర్టుకే..!

Supreme court directs hyderabad hc to decide on ravi prakash bail plea

Ravi Prakash, Shivaji, Forgery Case, Cyberabad Cybercrime Police, Supreme Court, Telangana High Court, Hyderabad, data theft, fake shares purchase, national company law tribunal, Forgery Case, Cyberabad Cybercrime Police, Hyderabad, KCR, Telangana CM, Telangana, politics

TV9 former CEO Ravi Prakash who knocked the Supreme Court's door for anticipatory bail has been directed to go to High Court. The apex court on Monday also asked the High Court to order a merit-based inquiry on Ravi Prakash's bail petition.

సుప్రీంకోర్టులో రవిప్రకాష్ కు చుక్కెదురు.. మళ్లీ హైకోర్టుకే..!

Posted: 06/03/2019 05:33 PM IST
Supreme court directs hyderabad hc to decide on ravi prakash bail plea

పోర్జరీ, డాటా చోరి, అధికార దుర్వినియోగంతో టీవీ9 లోగా సహా కాపిరైట్స్, రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ లను కారుచౌకగా మరో కంపెనీకి కట్టబెట్టాడన్న అభియోగాలను ఎదుర్కోంటూ తప్పించుకుని తిరుగుతున్న సీనియర్ పాత్రికేయుడు, టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ కు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసులన్నీ ఉద్దేశపూర్వకంగా నమోదు చేసినవేనంటూ, తనకు ముందస్తు బెయిల్ ఇప్పించాలని కోరిన నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఆయనను రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది.

రవిప్రకాష్ ముందస్తు బెయిల్ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఇవాళ దానిపై విచారణ జరిపింది. అయితే, ముందస్తు బెయిల్ కోసం రవిప్రకాశ్ తిరిగి హైకోర్టుకే వెళ్లాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై మెరిట్ ఆధారంగా విచారణ జరపాలని ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ నెల 10న విచారణ జరిపి రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ పై నిర్ణయం తీసుకోవాలని దిగువకోర్టుకు స్పష్టం చేసింది. దీంతో రవిప్రకాష్ కు స్వల్ప ఊరట లభించింది.

అంతేకాకుండా, 41ఏ నోటీసు కింద విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని అటు రవిప్రకాశ్ కు కూడా అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. కాగా, రవిప్రకాశ్ ను అరెస్ట్ చేయాలనుకుంటే 48 గంటల ముందు నోటీసులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, పోలీసులను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. కాగా, సుప్రీంకోర్టులో రవిప్రకాశ్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వి వాదనలు వినిపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles