AN-32 aircraft of IAF goes missing in Assam ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం AN-32 మిస్సింగ్..

Indian air force s an 32 aircraft with 13 onboard goes missing

airforce, Air Force An-32 transport plane, IAF Plane An-32 goes missing, IAF plane goes missing near China border, IAF Plane An-32 missing, IAF plane with 13 people onboard goes missing, An-32 plane missing, Air Force plane, An-32 transport plane, China border, jorhat, Assam, Crime

An Indian Air Force transport aircraft has gone missing after taking off from an airbase in Assam. 13 people were onboard the plane, including eight crew members and five passengers.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం AN-32 మిస్సింగ్..

Posted: 06/03/2019 04:56 PM IST
Indian air force s an 32 aircraft with 13 onboard goes missing

భారత వాయుసేనకు చెందిన విమానం మిస్ అయింది. ఈ మధ్యాహ్నం సరిగ్గా ఒంటి గంట సమయంలో విమానంతో గ్రౌండ్ స్టేషన్ తో సంబంధాలను తెగిపోయాయి. 13 మందితో ఇవాళ మధ్యాహ్నం 12.25 గంటలకు ఏఎన్-32 ఎయిర్ క్రాఫ్ట్ అస్సోంలోని జోర్హట్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ లోని మేచుకాలోని అడ్వాన్స్ ల్యాండింగ్ కంట్రోల్ కు బయల్దేరింది. ఈ ప్రాంతం అరుణాచల్ ప్రదేవ్ లోని తూర్పు హిమాలయా ప్రాంతంలోని వున్న వెస్ట్ సియాంగ్ జిల్లాలో వుంది. ఇది సుమారుగా 30 కిలోమీటర్ల దూరంలో భారత్-చైనా సరిహద్దు ప్రాంతం వుంది.

ఈ ప్రాంతానికి చేరుకునే క్రమంలో భారత వాయుసేన విమానం మిస్ అయ్యింది. ఈ విమానంలో 8 మంది క్రూ మెంబర్స్ తో పాటు మరో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. విమానం ఆచూకీ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే విమానం టేకాఫ్ అయిన 35 నిమిషాల వరకు గ్రౌండ్ స్టేషన్ తో సంబంధాలు కోనసాగిన తరువాత అది అదృశ్యం కావడంతో.. అధికారులు దానిని అన్వేషించే పనిలో పడ్డారు. అటు అరుణాచల్ ప్రదేశ్ కు కూడా చేరుకోకపోవడంతో.. విమానం ఏమైంది, ఎక్కడివెళ్లందనే విషయమై చర్యలు చేపట్టారు అధికారులు.

భారత వాయుసేన ఏఎన్-32 విమానాన్ని అన్వేషించేందుకు సుఖోయ్-30, సి-130లు స్పెషల్ అపరేషన్ ఎయిర్ క్రాప్ట్ లను అధికారులు రంగంలోకి దింపారు. దాదాపుగా 1983లొ భారత వాయుసేనలో చేరిన అన్టోవ్ ఏఎన్-32.. ఇప్పటికీ భారత వాయుసేవకు సేవలను అందిస్తోంది. అయితే గతంలో కూడా భారత వాయుసేనకు చెందిన ఏఎన్-32 విమానం మిస్ కాగా, దాని అచూకి ఇప్పటి వరకు అందుబాటులో లేదు.  జూలై 2016లో చెన్నై నుంచి అండమాన్ నికోబార్ ద్వీపాలకు బయల్దేరిన విమానం మిస్ అయ్యింది. విమానం కోసం దాదాపుగా రెండు నెలల పాటు అన్వేషించిన భారత దళాలు.. చివరికి సెప్టెంబర్ లో అన్వేషణను ముగించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Air Force plane  An-32 transport plane  IAF Plane missing  China border  jorhat  Assam  Crime  

Other Articles

  • Pakistan prime minister imran khan shows up when searching for bhikari

    పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. బికారియేనా.?

    Aug 19 | జమ్మూకాశ్మీర్ లో ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించి ఆ ప్రాంతవాసులకు కూడా యావత్ భారత దేశ ప్రజలు అనుభివిస్తున్న స్వేచ్ఛా వాయువును అందించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో పాటు పారిశ్రామీకరణకు దూరంగా వున్న ఈ ప్రాంతాన్ని... Read more

  • Minor girl in mumbai married off forced into flesh trade by mother raped by brother

    కుటుంబ పోషణ కోసం పైళ్లైన కూతురితో వ్యభిచారం

    Aug 19 | ఎలాంటి అలమరికలు లేకుండా ఉరుకులు. పరుగులు తీయాల్సిన వయస్సులో అమె పాలిట కన్నతల్లే కసాయిగా మారింది. తన బిడ్డ జోలికి ఎవరైనా వస్తే వారిని నిలువరించే తల్లులు వున్న ఈ సమాజంలో.. ఇలాంటి తల్లి... Read more

  • Ips officer booked for kicking pregnant lady who suffered miscarriage

    కోర్టు అదేశాలతో.. గర్భిణిని తన్నిన మహిళా ఎస్పీపై క్రిమినల్ కేసు..

    Aug 19 | పోలీసులకు నిందితులను అదుపులోకి తీసుకుని వారిని న్యాయస్థానంలో హాజరుపర్చాల్సిన బాధ్యత వున్నా.. దానిని అధిగమించి వారు పరారీలో వున్న నిందితుల అచూకీ కనుక్కునే సమయంలో నిందితుల సంబంధికులపై చేయి చేసుకోవడం, వారిని అకారణంగా ఠాణాలకు... Read more

  • 8 die as mini goods carrier plunges into well in tiruchi

    ఆటో టైరు పేలడంతో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి

    Aug 19 | తమిళనాడులో ఘోర రోడ్డప్రమాదం సంభవించింది. గూడ్స్ కారియర్ అటోలో ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తున్న ఆటో టైరు పేలడంతో ఈ దుర్ఘటన సంభవించింది. వేగంగా వెళ్తున్న ఆటో టైరు పేలడంతో అదుపుతప్పి రోడ్డు పక్కనున్న బ్యారికేడ్... Read more

  • Arun jaitley continues to be critical on life support

    అరుణ్ జైట్లీ ఆరోగ్యం మరింత విషమం.. ఎయిమ్స్ కు బీజేపి నేతలు

    Aug 18 | కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత అరుణ్ జైట్లీ ఆరోగ్యం మరింత విషమించింది. ఆయన కిడ్నీలు, ఊపిరితిత్తులు కూడా సక్రమంగా పనిచేయడం లేదని వైద్యులు అంటున్నారు. పరీక్షలు నిర్వహించి ఆయన అవయవాలు ఎలా పనిచేస్తున్నాయో... Read more

Today on Telugu Wishesh