India's Largest Shiva Statue to be placed in Nathdwara ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివయ్య విగ్రహం

Miraj group completes building up of world s tallest shiva statue in nathdwara

Sardar Vallabhai Patel’s statue, Gujarat, Statue of Unity, Spring Temple Buddha, Laykyun Setkyar, #statueofbelief #shivastatue #spiritual #significance #nathdwara politics, Indian news

India is now building world’s tallest Shiva murti, will be built at a height of 351 feet in Nathdwara, Rajasthan. Which will be the fourth largest statue in the world after- Statue of Unity, Spring Temple Buddha, and Laykyun Setkyar.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివయ్య విగ్రహం.. త్వరలో ప్రారంభం..

Posted: 06/01/2019 01:53 PM IST
Miraj group completes building up of world s tallest shiva statue in nathdwara

నర్మదా నది తీరంలో భారీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం తరువాత, మరో భారీ విగ్రహం తయారవుతోంది. రాజస్థాన్ లోని గణేశ్ టేక్రీ సమీపంలోని నాథ్ ద్వారా వద్ద పరమశివుని అత్యంత భారీ విగ్రహం నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఆవిష్కరణ తరువాత ఇది ప్రపంచంలోనే అతిపెద్ద శివుని విగ్రహం కానుంది. ఆగస్టు నాటికి పనులు పూర్తి చేస్తామని విగ్రహ ఏర్పాటు కమిటీ చెబుతోంది. విగ్రహ నిర్మాణానికి మొత్తం 2,500 టన్నుల ఉక్కును వాడుతుండగా, దీని ఎత్తు 351 అడుగులు ఉంటుంది.

ఈ విగ్రహాన్ని చూసేందుకు మూడు వ్యూ గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వాటిలో మొదటిది 20 అడుగల ఎత్తులో, 110 అడుగుల ఎత్తులో, 270 అడుగుల ఎత్తులో ఉంటాయి. అక్కడికి చేరుకునేందుకు లిఫ్ట్ లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహ నిర్మణం మిరాజ్ గ్రూప్ ఆధ్వర్యంలో జరుగుతుండగా, ఉక్కుతో పాటు హై క్వాలిటీ కాపర్, జింక్ లను కూడా వాడుతున్నామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ విగ్రహం ప్రపంచంలోని అన్ని విగ్రహాల్లో నాలుగో అతిపెద్దదని, కాగా దేశంలోనే తొలి అతిపెద్ద శివవిగ్రహంగా ఇది కీర్తికెక్కనుంది.

2013 ఏప్రిల్ 17న విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభించామని మిరాజ్ గ్రూప్ పేర్కొంది. ట్విట్టర్ లో సంస్థ విడుదల చేసిన ఫొటోలను పరిశీలిస్తే, విగ్రహ నిర్మాణం దాదాపు పూర్తయిందని తెలుస్తోంది. శివుని తలకు పెయింటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం విగ్రహం మెడ నుంచి కింది భాగం వరకూ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ విగ్రహం ముందు కొలువుదీరనున్న భారీ నంది 37 అడుగుల పొడవుతో, 25 అడుగుల ఎత్తుతో ఉండనుంది. ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారం అంతా సవ్యంగా జరిగివుంటూ ఇప్పటికే ఈ విగ్రహం అవిష్కరణకు నోచుకునేది. కానీ అత్యంత భారీ విగ్రహం కాబట్టి కొంత పనులు అలస్యమైయ్యాయని.. అయితే భక్తులకు చూడచక్కగా విగ్రహాన్ని రూపోందించడంలో ఎక్కడా రాజీ పడటం లేదని మిరాజ్ గ్రూప్ ప్రతినిధులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shiva statue  Lord shiva  tallest shiva statue  statueofbelief  Nathdwara  Rajasthan  politics  Indian news  

Other Articles