Virginia Beach Shooting Leaves at Least 12 Dead కాల్పుల మోతతో దద్దరిల్లిన అగ్రరాజ్యం.. 12 మంది మృతి

12 people were killed in a shooting at a city government building in virginia

America shooting, shooting in america, shooting in US, mass shootings","virginia","virginia beach municipal center","virginia beach shooting","virginia shooting, virginia beach shooting, Virginia Beach Municipal Center Shooting,shooting in US, Municipal Center, Government Building, Employee, Virginia, America, Police, Crime

Twelve people were killed and at least four others were injured after a city employee opened fire at a large government complex in Virginia, officials said.

కాల్పుల మోతతో దద్దరిల్లిన అగ్రరాజ్యం.. 12 మంది మృతి

Posted: 06/01/2019 11:19 AM IST
12 people were killed in a shooting at a city government building in virginia

అగ్రరాజ్యం అమెరికాలో మరోమారు కాల్పుల మోత దద్దరిల్లింది. అమెరికాలో గన్‌కల్చర్ ఎంత ప్రమాదకరంగా మారిందో తాజా ఘటన మరోసారి నిరూపించింది. వర్జీనియా రాష్ట్రంలోని వర్జీనియా బీచ్ నగరంలోని మున్సిపల్ కాంప్లెక్స్ లో తన సహోద్యోగులపై కక్ష గట్టిన ఓ దుండుగుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 12 మంది మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో ప్రభుత్వ భవన సముదాయంలోకి ప్రవేశించిన సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడు.

ప్రభుత్వ మున్సిఫల్ కాంప్లెక్సులోని ప్రభుత్వ శాఖల సముదాయంలోకి ప్రవేశించిన దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ పోలీసు కూడా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని దుండగుడికి హతమార్చారు. దుండగుడు అదే భవన సముదాయంలో పనిచేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. అయితే ఈ దారుణానికి అతడు ఎందుకు పాల్పడ్డాడో తెలియలేదని చెప్పారు.

దీనిపై విచారణ జరుపుతున్నామని వర్జీనియా పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో అక్కడికక్కడే మృతిచెందిన 12 మంది మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అసుపత్రికి తరటించారు. మక్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాల్పుల వెనుకున్న కారణాలపై దర్యాప్తు చేసి తెలుసుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ తరహ ఘటనలు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ సహచర ఉద్యోగులపై అగ్రరాజ్యం వారు ఎందుకు కక్షగడుతున్నారన్న విషయాన్ని అక్కడి ప్రభుత్వాలు అధ్యయనం చేయల్సిన అవసరం ఎంతైనా వుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shooting in US  Municipal Center  Government Building  Employee  Virginia  America  Police  Crime  

Other Articles